ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Transfers: రాష్ట్రంలో కొనసాగుతున్న అధికారుల బదిలీలు - krishna district news

రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ను, కృష్ణా జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డా .బాలసుబ్రమణ్యం ను బదిలీ చేశారు. దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి.

transfer of officials in the state
రాష్ట్రంలో కొనసాగుతున్న బదిలీలు
author img

By

Published : May 27, 2021, 11:00 PM IST

రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు బదిలీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ (ఆసరా & అభివృద్ధి) గా బి. శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు.

కృష్ణా జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ బదిలీ..

కృష్ణా జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డా .బాలసుబ్రమణ్యంపై బదిలీ వేటు పడింది. ఆరోగ్య శ్రీ డిప్యూటీ కో ఆర్డినేటర్ గా పనిచేస్తున్న డా .ఉస్మాన్ ను ఇన్ ఛార్జ్ ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్​గా నియమించారు. ఇటీవల జిల్లాలో కోవిడ్ ఆసుపత్రుల్లో జేసీ విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ కోవిడ్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద పడకల కేటాయింపు సరిగా లేదని గుర్తించారు. 52 ఆసుపత్రుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని.. వారిపై రూ. 3.61 కోట్లను జరిమానాగా విధించారు. ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ పర్యవేక్షణ లోపమే కారణమని తనిఖీల్లో తేలిందని సమాచారం. దీంతో ఉన్నతాధికారులు డా.సుబ్రమణ్యం ను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details