ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణం అది కాదు : ట్రాన్స్​కో ఎండీ - 230 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్​ వినియోగం

Transco MD Sridhar on Electricity Tariff: ప్రస్తుతం వేసవి డిమాండ్​ దృష్ట్యా.. 230 మిలియన్ యూనిట్ల విద్యుత్​ వినియోగం అవుతోందని ట్రాన్స్‌ కో ఎండీ శ్రీధర్​ తెలిపారు. పీపీఏల రద్దు వల్లే ప్రస్తుతం ఛార్జీలు పెరిగాయన్న వాదన నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. గతంలో చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాల వల్లే తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.

ట్రాన్స్‌ కో ఎండి శ్రీధర్
Transco on Tariff Orders

By

Published : Mar 31, 2022, 5:08 PM IST

Transco Md on PPA: ప్రస్తుతం వేసవి కావడంతో విద్యుత్‌ డిమాండ్ పెరిగిందని ట్రాన్స్‌ కో ఎండీ శ్రీధర్ తెలిపారు. సాధారణ రోజుల్లో 180 మిలియన్ యూనిట్ల వినియోగం మాత్రమే ఉంటుండగా.. ప్రస్తుతం వేసవి కావడంతో 230 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోందన్నారు. పీపీఏల రద్దు వల్లే ప్రస్తుతం ఛార్జీలు పెరిగాయన్న వాదనలో నిజం లేదని ట్రాన్స్‌ కో ఎండీ స్పష్టం చేశారు. పీపీఏలను ప్రభుత్వం రద్దు చేయలేదని.. ధరలను సమీక్షించమని కంపెనీలను కోరిందని వివరించారు. సెకీ నుంచి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని.. ఆ విద్యుత్​ను వ్యవసాయం కోసమే వివియోగిస్తామని తెలిపారు.

'గతంలో దీర్ఘకాలిక విద్యుత్ సరఫరా ఒప్పందాలు అధిక ధరలకు చేసుకోవడం వల్లే ఇప్పుడు తీవ్ర నష్టం జరుగుతోంది. బొగ్గు ధరల కారణంగా గతంలో కొన్ని యూనిట్లు మూసివేయాల్సి వచ్చింది. ట్రూ అప్ ఆదాయం పెంపునకు ఏపీ ఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఈఆర్సీ ఆమోదించిన ట్రూ అప్ ఆదాయం.. డిస్కంలకు రూ. 2100 కోట్లు పెంచింది. రిటైల్ టారిఫ్ సప్లై ఆర్డర్ ద్వారా రూ. 1400 కోట్లు, అలాగే ట్రూ అప్ మరో రూ.700 కోట్లు వసూలు చేసుకునే వెసులుబాటు ఉంది' అని ట్రాన్స్‌కో ఎండీ శ్రీధర్​ వివరించారు.

ప్రస్తుతం రూ. 83 వేల కోట్ల అప్పు:విద్యుత్ కొనుగోలుకు 6.90 పైసల మేర ఛార్జీ అవుతోందని ఎండీ అన్నారు. ఆ ఖర్చులో 50 శాతం మేర మాత్రమే 75 యూనిట్లలోపు వినియోగదారులపై పడుతోందని తెలిపారు. ఎక్కడా అదనపు వ్యయం విధించలేదని స్పష్టం చేశారు. ట్రూ డౌన్ చార్జీల కింద రూ. 2600 కోట్ల వరకు విద్యుత్ సంస్థలు ఆదా చేశాయని వెల్లడించారు. ప్రస్తుతం విద్యుత్ సంస్థలకు రూ. 83 వేల కోట్ల అప్పు ఉందని ట్రాన్స్​కో ఎండీ చెప్పారు.


ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details