ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TRANSCO: 'వారికి విద్యుత్‌ ఛార్జీల భారం స్వల్పమే': ట్రాన్స్‌కో సీఎండీ శ్రీధర్‌

TRANSCO: విద్యుత్‌ వినియోగదారుల్లో 50 శాతం మంది 75 యూనిట్లలోపు టారిఫ్‌ పరిధిలోకి వస్తారని ట్రాన్స్‌కో ఇన్‌ఛార్జ్‌ సీఎండీ బి.శ్రీధర్‌ తెలిపారు. అటువంటి వారికి స్వల్పంగా విద్యుత్‌ ఛార్జీలు పెరుగుతాయన్నారు. విద్యుత్‌ ఛార్జీలను టెలిస్కోపిక్‌ విధానంలోనే లెక్కిస్తామని తెలియజేశారు.

By

Published : Apr 1, 2022, 7:49 AM IST

transco cmd sridhar
విద్యుత్‌ ఛార్జీల భారం స్వల్పమే

TRANSCO: విద్యుత్‌ వినియోగదారుల్లో 50 శాతం మంది 75 యూనిట్లలోపు టారిఫ్‌ పరిధిలోకి వస్తారని, వారికి స్వల్పంగా విద్యుత్‌ ఛార్జీలు పెరుగుతాయని ట్రాన్స్‌కో ఇన్‌ఛార్జ్‌ సీఎండీ బి.శ్రీధర్‌ తెలిపారు. విద్యుత్‌ ఛార్జీలను టెలిస్కోపిక్‌ విధానంలోనే లెక్కిస్తామని విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అన్నారు. విద్యుత్‌ సంస్థల అప్పులు రూ.83 వేల కోట్లకు చేరాయన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో జేఎండీ పృధ్వీ తేజ, కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ పద్మాజనార్ధనరెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ పాల్గొన్నారు.

"2022-23 సంవత్సరానికి ట్రూఅప్‌ కింద రూ.700 కోట్లు, టారిఫ్‌ పెంపుతో రూ.1,400 కోట్లు వస్తాయి. రాష్ట్రంలో బొగ్గు గనులు లేని కారణంగా ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుంది. బొగ్గు ధరలు.. రవాణా ఛార్జీల పెరుగుదల కారణంగా ఉత్పత్తి వ్యయం ఏడాదికి సుమారు 14 శాతం పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత డిమాండ్‌ 230 మిలియన్‌ యూనిట్లకు చేరింది. 180-190 ఎంయూలకు పీపీఏలు ఉన్నాయి. సాధారణ రోజుల్లో డిమాండ్‌కు ఇది సరిపోతుంది. అలాకాకుండా దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంటే స్థిర ఛార్జీల భారం పడి నష్టపోతాం. 2022-23లో రూ.45వేల కోట్లు ఖర్చు అవుతుంది. అందులో రూ.11,123 కోట్లు లోటు ఉంటుంది. ఈ మొత్తాన్ని సబ్సిడీ రూపేణా ప్రభుత్వం భరిస్తుంది. మూడేళ్లలో ట్రూఅప్‌ కింద రూ.2,100 కోట్లు వసూలవుతాయి". -బి. శ్రీధర్‌, ట్రాన్స్‌కో ఇన్‌ఛార్జ్‌ సీఎండీ

ఇదీ చదవండి: Tirumala: ఆర్జితసేవా టికెట్లకు విశేష స్పందన

ABOUT THE AUTHOR

...view details