ట్రైనీ ఐఏఎస్ బానోత్ మృగేందర్‌లాల్‌పై (Trainee IAS sexual harassment case) హెదరాబాద్లోని కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. మృగేందర్‌లాల్ పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు ట్రైనీ ఐఏఎస్ మృగేందర్‌లాల్‌పై కేసు చేశారు. మృగేందర్‌లాల్.. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ కుమారుడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం మధురైలో ట్రైనీ ఐఏఎస్‌గా బానోత్ మృగేందర్‌లాల్ (Trainee IAS sexual harassment case) ఉన్నారు. ఫేస్‌బుక్‌లో మృగేందర్‌లాల్‌తో పరిచయం ఏర్పడిందన్న యువతి... ప్రేమ పేరుతో తనకు దగ్గరయ్యాడని తెలిపింది. మృగేందర్‌లాల్ తనపై లైంగికదాడి చేశాడని యువతి ఫిర్యాదు చేసింది.