దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. ఆరో రోజు, అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రి(cm jagan vijayawada indrakeeladri tour)పై సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ప్రభుత్వం తరఫున సీఎం జగన్.. పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆలయానికి చేరుకోనున్న సీఎం.. అమ్మవారికి సంబంధించిన ఆగ్‌మెంటెడ్ రియాల్టీ షో ప్రారంభించిన అనంతరం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సరస్వతీ దేవి రూపంలో అమ్మవారిని సేవించుకుంటే జ్ఞానం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇంద్రకీలాద్రిపై అర్ధరాత్రి నుంచి భక్తుల తాకిడి మొదలైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు. కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించడంలేదు.
భద్రత ఏర్పాట్లపై సమీక్ష..
విజయవాడ ఇంద్రకీలాద్రిపైకి మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(cm jagan vijayawada tour) రానున్న సందర్బంగా కొండపై జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ నివాస్(collctor nivas) పరిశీలించారు. ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్, పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు(srinivasulu) సమీక్షించారు. అర్ధరాత్రి 3 గంటల నుంచి మూలా నక్షత్రం రోజు ప్రారంభమవుతున్నందున ఆ సమయం నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
కొండపైకి ట్రయిల్ రన్
ముఖ్యమంత్రి జగన్.. ఇంద్రకీలాద్రి పర్యటన సందర్భంగా అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా కొండపైకి కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించారు. ట్రయిల్ రన్లో గుర్తించిన లోపాలను ఆలయ అధికారులతో కలిసి సమీక్షించారు. సీఎం వచ్చే సమయంలో కాన్వాయ్ మినహా ఇతర వాహనాలను అనుమతించరాదని అధికారులు నిర్ణయించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రకాశం బ్యారేజిపై ట్రాఫిక్(traffic)ను అనుమతించమని, సీఎం వచ్చే సమయంలో కొద్దిసేపు కనకదుర్గ వారధి(kanakadurga varadhi)పై ట్రాఫిక్‌ను నిలుపుతామని విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. ఈరోజు రాత్రి 9:30 గంటల నుంచి దర్శనాలను ఆపి, మూలా నక్షత్రం అలంకారం పూర్తయ్యాక దర్శనం తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు.