ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో జులై 1న ట్రాఫిక్ ఆంక్షలు - విజయవాడ తాజా వార్తలు

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు 104, 108 నూతన వాహనాలు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జులై 1న శ్రీకారం చుట్టనున్నారు. విజయవాడ బెంజిసర్కిల్‌ కూడలిలో వాహనాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ క్రమంలో ఆ రోజు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

Traffic restrictions on July1 in Vijayawada
Traffic restrictions on July1 in Vijayawada

By

Published : Jun 29, 2020, 11:02 PM IST

జులై 1వ తేదీన 104, 108 నూతన వాహనాలను విజయవాడలోని బెంజ్​ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపులు, సీఎం సభ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ట్రాఫిక్ ఆంక్షల వివరాలను సీపీ బి.శ్రీనివాసులు వెల్లడించారు.

  • చెన్నై వైపు నుంచి విజయవాడ మీదుగా ఏలూరు, విశాఖపట్నానికి వెళ్లే వాహనాలు... ప్రకాశం జిల్లా త్రోవగుంట వద్ద నుంచి - బాపట్ల- అవనిగడ్డ - చల్లపల్లి- పామర్రు- గుడివాడ- హనుమాన్ జంక్షన్ మీదుగా ఏలూరు వైపునకు వెళ్లాలి
  • గుంటూరు నుంచి విజయవాడ నగరంలోకి లారీలు / భారీ వాహనాలకు అనుమతి లేదు
  • విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్లే భారీ వాహనాల్ని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి గుడివాడ- పామర్రు- చల్లపల్లి- అవనిగడ్డ మీదుగా పంపిస్తారు.
  • బెంజ్ సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు రెండు వైపులా ఏ విధమైన వాహనాల రాకపోకలకు అనుమతి లేదు
  • గుంటూరు వైపు నుంచి విజయవాడ, ఏలూరు వెళ్లే కార్లు, మోటార్ సైకిళ్లను.. వారధి- పాత కృష్ణలంక పోలీసు స్టేషన్- పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి విజయవాడ నగరంలోకి అనుమతిస్తారు
  • ఏలూరు వైపు నుంచి గుంటూరు వైపునకు వెళ్లే కార్లు, మోటార్ సైకిళ్లు రమేశ్ హాస్పిటల్ నుంచి గురునానాక్ నగర్ రోడ్డు- ఫన్ టైమ్ క్లబ్ రోడ్డు - పంట కాలువ రోడ్డు- ఎన్టీఆర్ సర్కిల్- కృష్ణవేణి రోడ్డు- గుల్జార్ బ్రిడ్జ్ - రామలింగేశ్వర్ నగర్- స్కూ బ్రిడ్జ్- వారధి మీదుగా వెళ్లాలి
  • మచిలీపట్నం వైపు నుంచి గుంటూరు వెళ్లే కార్లు, మోటార్ సైకిళ్లు బందరు రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్- కృష్ణవేణి రోడ్డు- గుల్జార్ బ్రిడ్జ్- రామలింగేశ్వర్ నగర్- స్క్రూ బ్రిడ్జ్ వారధి మీదుగా వెళ్లాలి
  • మచిలీపట్నం వైపు నుంచి విజయవాడ నగరంలోకి వచ్చే వాహనాలను ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు నుంచి- పంట కాలువ - ఏపీఐఐసీ కాలనీ రోడ్డు - గురునానక్ నగర్ రోడ్డు - రమేశ్ హాస్పిటల్ నుంచి విజయవాడ నగరంలోకి అనుమతిస్తారు.


ఆర్టీసీ బస్సుల మళ్లింపు మార్గములు

  • ఏలూరు వైపు నుంచి విజయవాడ వచ్చే ఆర్టీసీ బస్సులు రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి - ఏలూరు రోడ్డు- గుణదల చుట్టుగుంట- దీప్తి జంక్షన్- అప్సరా జంక్షన్ - ఆర్టీసీ వై జంక్షన్ - పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి పీఎన్​బీఎస్​కు వెళ్లాలి
  • మచిలీపట్నం వైపు నుంచి విజయవాడ వచ్చే ఆర్టీసీ బస్సులు తాడిగడప- ఆటోనగర్ 100 అడుగులు రోడ్డు - మహానాడు రోడ్డు- రామవరప్పాడు రింగ్ - ఏలూరు రోడ్డు - గుణదల - చుట్టుగుంట- దీప్తి జంక్షన్ - అప్పరా జంక్షన్- ఆర్టీసీ వై జంక్షన్ - పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి పీఎన్​బీఎస్​కు వెళ్లాలి

ABOUT THE AUTHOR

...view details