విజయవాడ అజిత్ సింగ్ నగర్ పైపుల రోడ్డు కూడలిలో నాలుగో పట్టణ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. నాలుగు బృందాలుగా వీడి వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. పలువురు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. మొదటిసారి దొరికిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరి కొందరికి జరిమానా విధించారు. మరోసారి పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.
విజయవాడలో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు - vijayawada traffic police latest news
విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారికి జరిమానా విధించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు.
విజయవాడలో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు