ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ సరిహద్దులో నిలిచిన వందల వాహనాలు.. ఈ-పాస్ లేకుంటే నో ఎంట్రీ! - కృష్ణా జిల్లా వాహనాలు

ఆంధ్ర - తెలంగాణ సరిహద్దుల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఈ- పాస్ లేని వాహనాలను తెలంగాణలోకి అనుమతించకపోవడంతో గంటల నిరీక్షణ తరువాత వెనుదిరుగుతున్నారు. ఆ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని రామాపురం చెక్‌పోస్టు వద్ద వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

traffic at borders
సరిహద్దుల్లో నిలిచిన వందల వాహనాలు

By

Published : Jun 13, 2021, 1:52 PM IST

Updated : Jun 13, 2021, 5:31 PM IST

తెలంగాణ సరిహద్దులో నిలిచిన వందల వాహనాలు

లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు, వారాంతం దృష్ట్యా.. ఆంధ్ర నుంచి తెలంగాణకు వెళుతున్న వాహనాల తాకిడి పెరిగింది. సరిహద్దులోని సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని రామాపురం చెక్‌పోస్టు వద్దకు పెద్ద ఎత్తున వాహనాలు చేరుకున్నాయి. దీంతో.. ఈ-పాస్‌ ఉన్న వాహనాలను మాత్రమే తెలంగాణ పోలీసులు అనుమతిస్తున్నారు. పాసులు లేని వారిని వెనక్కి పంపిస్తున్నారు.

దీనివల్ల వందల సంఖ్యలో అక్కడ వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. పోలీసులు నిరాకరణతో గంటల తరబడిగా వాహనదారులు నిరీక్షించి.. చేసేదిలేక చివరికి వెనుదిరుగుతున్నారు. రాత్రి నుంచి 'ఈ-పాస్‌'లు ఉన్న 700 వాహనాలను అనుమతించగా.. 1,500 వాహనాలను పాస్‌లు లేనందున వెనక్కి తిప్పి పంపినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సరిహద్దు వద్ద వాహనాల రద్దీ నెలకొంది.

Last Updated : Jun 13, 2021, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details