ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు.. అందించనున్న సీఎం జగన్ - వైఎస్సార్ యంత్ర సేవ పథకం తాజా వార్తలు

'వైఎస్సార్ యంత్ర సేవ' పథకం కింద రైతు గ్రూపులకు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. గుంటూరులో జూన్ 7న వీటి పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

'వైఎస్సార్ యంత్ర సేవ పథకం' కింద రైతులకు ట్రాక్టర్లు
'వైఎస్సార్ యంత్ర సేవ పథకం' కింద రైతులకు ట్రాక్టర్లు

By

Published : Jun 5, 2022, 10:22 PM IST

రైతుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన 'వైఎస్సార్ యంత్ర సేవ' పథకం కింద రైతు గ్రూపులకు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను పంపిణీ చేయనుంది. గుంటూరులో జూన్ 7న పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. మెగా మేళాలో 5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు 175.61 కోట్ల సబ్సిడీని సీఎం జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకే, క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీ చేయనున్నారు. కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ఆర్బీకేల్లో వ్యవసాయ యంత్రాలను తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్రాలు, పరికరాలు ఇచ్చే ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, మరింత మెరుగైన ఆదాయం అందించాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.

రైతన్నలకు మరింత రాబడి అందించేలా 2,106 కోట్ల వ్యయంతో ఆర్బీకే స్థాయిలో ఒక్కొక్కటి రూ.15 లక్షల విలువ గల 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి 25 లక్షల విలువైన కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రైతుల గ్రూపులకు 40 శాతం రాయితీతో సబ్సిడీ సాగు యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆప్కాబ్, డీసీసీబీ ద్వారా యంత్ర పరికరాల ఖరీదులో మరో 50 శాతం రుణాన్ని తక్కువ వడ్డీకే అందించే ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

వైఎస్సార్ యంత్రసేవా పథకం క్రింద మొత్తం సబ్సిడీ కోసం రూ.806 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. జూన్ 7 న జరిగే మెగా మెళాలో ట్రాక్టర్లతో పాటు అనుసంధాన పరికరాలైన బంపర్, 3 పాయింట్ లింకేజ్, హెచ్ బార్ పరికరాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అలాగే కంబైన్డ్ హార్వెస్టర్ల ఒక ట్రాక్, ఒక సంవత్సరం పాటు సర్వీసింగ్, ఆపరేటర్​కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. డ్రోన్ పరికరాల సహాయంతో పంటలకు సూక్ష్మ ఎరువులు, పురుగు మందులను అందించి రైతన్నలకు పెట్టుబడి ఖర్చును తగ్గించే దిశగా ఈ ఏడాది 2,000 గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలకు డ్రోన్స్ కూడా సరఫరా చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

యాంత్రీకరణలో భాగంగా దుక్కి యంత్రాలు, దమ్ము, చదును చేసే పరికరాలు, వరినాటు యంత్రాలు, నూర్పిడి యంత్రాలు, విత్తనం-ఎరువు పరికరాలు, కలుపుతీసే పరికరాలు, సస్యరక్షణ పరికరాలు, కోతకోసే యంత్రాలు మొదలైనవాటిలో స్థానిక రైతుల అవసరాలకు అనుగుణంగా కావాల్సిన యంత్రాలు, పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details