'నేను సైతం రైతు కోసం' పేరిట అఖిలపక్ష రైతు కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని బీఆర్‌టీఎస్ రహదారిపై రైతుల కవాతు, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర రైతు సంఘాలు, మహిళా సంఘాల నేతలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
కృష్టా జిల్లాలో అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ - కృష్టా జిల్లా తాజా వార్తలు
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా విజయవాడలో అన్నదాతలు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. కేెంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఐ నేతలతో పాటు రైతు సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కృష్టా జిల్లాలో అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలతోపాటు.. విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి:ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తత- రైతులపై లాఠీఛార్జ్