ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP Tourism: భవానీ ద్వీపంలో పలు అభివృద్ధి పనులకు కార్యాచరణ

విజయవాడలోని భవానీ ద్వీపం(Bhavani Island)లో ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రతిపాదనల్ని ఆహ్వానిస్తూ...ఉత్తర్వులు జారీ చేసింది. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు సిద్ధమని పర్యటకశాఖ స్పష్టం చేసింది.

Tourism Projects in Bhavani Island
Tourism Projects in Bhavani Island

By

Published : Jun 25, 2021, 9:54 PM IST

విజయవాడలోని భవానీ ద్వీపం(Bhavani Island)లో వివిధ ప్రాజెక్టులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనల్ని ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భవానీ ద్వీపం(Bhavani Island)లో వాటర్ పార్కు, మినీ అక్వేరియం, స్కై రెస్టారెంట్, టాయ్ ట్రైన్, రోప్ వే ప్రాజెక్టులను నిర్మిచేందుకు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ద్వారా ప్రతిపాదనల్ని ఆహ్వానిస్తూ పర్యటక శాఖ(Tourism)ఉత్తర్వులు ఇచ్చింది. వ్యక్తులు, సంస్థలు ఈ ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనల్ని సమర్పించవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు సిద్ధమని పర్యటకశాఖ స్పష్టం చేసింది. ఏపీ టూరిజం కార్పోరేషన్​కు ఈ ప్రతిపాదనల్ని సమర్పించాల్సిందిగా ప్రభుత్వం సూచించింది.

ABOUT THE AUTHOR

...view details