- CM tour in flood areas: కోనసీమ వరద ప్రాంతాల్లో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన
CM tour in flood areas: కోనసీమ జిల్లా ముంపు గ్రామాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పర్యటించనున్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. ఇందుకు సంబంది ఏర్పాట్లను అదికార్ల పర్యవేక్షిస్తున్నారు.
- పోలవరంపై సీఎం జగన్ ఇప్పుడేం చెబుతారు ?: చంద్రబాబు
Chandra Babu on Polavaram: పోలవరం నిర్మాణం విషయంలో ప్రభుత్వ తప్పును కేంద్రం, పీపీఏ, నిపుణుల కమిటీ తేల్చి చెప్పాయని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. సీఎం జగన్ ఇప్పుడేం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. గుత్తేదారును మార్చవద్దని పీపీఏ, జలవనరులశాఖ చెప్పినా వైకాపా ప్రభుత్వం వినిపించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Kidnap: గుడివాడలో 15 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. ఎదురింటి మహిళ పనేనా..!
కృష్ణా జిల్లా గుడివాడ గుడ్‌మెన్‌పేటకు చెందిన 15 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. ఎదురింట్లో ఉండే మహిళ అపహరించిందని.. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- 'సినిమా విడుదలైన రెండు వారాల తరువాతే ఓటీటీకి ఇవ్వాలి'
OTT: సినిమా విడుదలైన రెండు వారాల తరువాతే ఓటీటీకి ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఓటీటీ వల్ల థియేటర్లలో కొత్త సినిమాలకు తొలి రోజే ప్రేక్షకులు ఉండటం లేదని వారు వాపోతున్నారు. సినిమా టిక్కెట్ రేట్లు ఇప్పుడున్న విధంగా యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నారు.
- ఆ ఎంపీలకు ఏడుగురు సంతానం.. మరి 'జనాభా నియంత్రణ' ఎలా?
Population Control Bill: దేశంలో జనాభా నియంత్రణపై మరోసారి చర్చ మొదలైంది. టూ ఛైల్డ్ పాలసీకి మద్దతుగా బిల్లు తీసుకొస్తున్నట్లు భాజపా ఎంపీ ప్రకటించిన నేపథ్యంలో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. మరి, బిల్లు పార్లమెంట్ గడప దాటుతుందా? ఇద్దరికి మించి సంతానం ఉన్న ఎంపీల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం దీనిపై ఏమంటోంది?
- నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు- లోక్‌సభ తీర్మానం
లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ధరల పెరుగుదల అంశంపై లోక్‌సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించినందుకు కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. స్పీకర్ హెచ్చరించినా అనుచిత ప్రవర్తనతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న వారిని.. వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని లోక్‌సభ తీర్మానించింది.
- కదలలేని స్థితిలో కైకాల.. బైడ్పైనే కేక్ కట్ చేయించిన చిరు
Chiranjeevi wishes Kaikala satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన చేత కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో ట్వీట్ చేశారు.
- బాక్సర్ లవ్లీనా సంచలన ఆరోపణలు.. అధికారులు వేధిస్తున్నారంటూ..
Boxer Lovelina mental harrassment: ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బాక్సర్ లవ్లీనాకు చేదు అనుభవం ఎదురైంది. కామన్వెల్త్ క్రీడలకు సిద్ధమవుతున్న తనను కొంతమంది అధికారులు మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు చేసింది.
- అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. బాధగా ఉంది: శ్రేయస్
భారత టీ20 లీగ్‌తో పాటు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ సిరీస్‌లలోనూ విఫలమైన టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో అదరగొడుతున్నాడు. అయితే తాజా ఇంటర్వ్యూలో తన ప్రదర్శనపై మాట్లాడాడు. ఏమి చెప్పాడంటే..
- 'మంకీపాక్స్.. కొత్త వైరస్ కాదు.. మరీ భయం అక్కర్లేదు..'
monkey pox: కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోన్న వేళ.. ప్రపంచ దేశాలను మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ వైరస్ 75 దేశాలకు వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించింది. అయినప్పటికీ ఈ వైరస్‌కు భయపడాల్సిన పని లేదని నిపుణులు చెబుతున్నారు. దీని వ్యాప్తి తక్కువేనని.. మరణాలూ అరుదేనని స్పష్టం చేస్తున్నారు.