ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 9pm - ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 9pm
ప్రధాన వార్తలు @ 9pm

By

Published : Nov 14, 2021, 9:01 PM IST

  • SZC Meeting: రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలు కాలేదు: సీఎం జగన్‌

రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు ముఖ్యమంత్రి జగన్(cm jagan speech in southern zonal council meeting news). తిరుపతి వేదికగా హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి భేటీ(southern zonal council meeting news)లో సీఎం జగన్ మాట్లాడారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మా పాలనలో.. వారంతా రాష్ట్రపతి భవన్ లో అడుగుపెడుతున్నారు : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన హోం మంత్రి.. నెల్లూరులో జరుగుతున్న స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇవాళ కాళ్లకు చెప్పులు లేని సామాన్యులు కూడా రాష్ట్రపతి భవన్‌కు వస్తున్నారని చెప్పారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Amaravathi Protest: ప్రభంజనంలా అమరావతి రైతుల మహా పాదయాత్ర..అడుగడుగునా జన నీరాజనం

జనం జనం కలిస్తే ప్రభంజనం అన్నట్లుగా అమరావతి రైతుల మహాపాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ప్రకాశం జిల్లాలో ఎక్కడికక్కడ ప్రజలు ఎదురేగి రైతులకు నీరాజనాలు పలికారు. ప్రభుత్వం మూడు ముక్కలాట మాని ..రైతుల ఆకాంక్షను గౌరవించాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • POLLING CLOSE: ప్రశాంతంగా ముగిసిన స్థానిక ఎన్నికల పోలింగ్

స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా... మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • PAWAN KALYAN : అప్పుడు 'అమ్మఒడి'.. ఇప్పుడు 'అమ్మకానికో బడి'

ఎయిడెడ్ విద్యాసంస్థల(Aided schools, colleges) విలీనంపై ప్రభుత్వ వైఖరిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్(pawan kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రైవేటు పరం చేయాలనే సర్కారు నిర్ణయంతో 2.5 లక్షల మంది విద్యార్థులకు(students) ఇబ్బందులు తలెత్తాయని మండిపడ్డారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • శాఖల్లో పారదర్శకత ఇక కేంద్ర మంత్రుల బాధ్యతే!

వివిధ పథకాల అమలులో అవలంబించాల్సిన మెరుగైన విధానాల రూపకల్పన బాధ్యతను కేంద్రమంత్రి మండలికి (Council Of Ministers India) అప్పగించారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 77 మంది ఉండగా వీరిని 8 గ్రూపులగా విభజించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • బ్రిటన్​ రాణికి మళ్లీ అనారోగ్యం- కీలక కార్యక్రమానికి దూరం

బ్రిటన్ మహారాణి ఎలిజబెత్​-2.. కీలక సంస్మరణ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. కొద్ది కాలంగా సమావేశాలకు దూరంగా ఉంటున్న ఆమె.. మరోసారి అనారోగ్యం బారినపడినందు వల్లే రెండో ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు బకింగ్​హామ్ ప్యాలెస్ ప్రకటనలో తెలిపింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పెట్రోల్ ధర అత్యధికంగా తగ్గింది ఈ రాష్ట్రంలోనే...

కేంద్రం ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించడం(Petrol excise duty reduction), రాష్ట్రాలు వ్యాట్​పై (Petrol VAT rate) కోత విధించడం వల్ల.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్​ ధర రూ.16 మేర తగ్గింది. అదే సమయంలో డీజిల్ ధర అత్యధికంగా రూ.19.61 మేర పడిపోయింది. ఏఏ రాష్ట్రాల్లో అత్యధికంగా పెట్రోల్ రేట్లు తగ్గాయంటే... పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • AUS VS NZ FINAL: అంచనాల్లేకుండా వచ్చి అద్భుతం చేసిన కివీస్!

టీ20 ప్రపంచకప్ ఫైనల్​లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి ఆస్ట్రేలియా-న్యూజిలాండ్. ఎంతో ఒత్తిడి తట్టుకుని, ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధించి తుదిపోరు వరకూ వచ్చాయి ఈ రెండు జట్లు. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో కివీస్ ప్రయాణం ఎలా సాగిందో గుర్తుచేసుకుందాం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Akhanda trailer: 'అఖండ' ట్రైలర్​తో బాలయ్య గర్జన

అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'అఖండ' ట్రైలర్(akhanda trailer)​ రిలీజైంది. ఆద్యంతం యాక్షన్​తో సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. డిసెంబరు 2న థియేటర్లలోకి సినిమాను తీసుకురానున్నట్లు ప్రకటించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details