ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM

.

ప్రధాన వార్తలు @ 9pm
ప్రధాన వార్తలు @ 9pm

By

Published : Sep 16, 2021, 9:00 PM IST

  • పచ్చజెండా
    ఏప్రిల్‌ జరిగిన పరిషత్‌ ఎన్నికలను.. హైకోర్టు సమర్ధించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • జీవో సస్పెండ్‌..
    పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్‌ నియామక జీవోను హైకోర్టు ఆరు వారాలపాటు సస్పెండ్‌ చేసింది. జస్టిస్ కనగరాజ్ నియామకం సవాలు చేస్తూ న్యాయవాది పారా కిషోర్​ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • నాన్ బెయిలబుల్ వారెంట్
    ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో ఇద్దరు మాజీ అధికారులపై సీబీఐ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ జి.వెంకట్రామిరెడ్డి, గనులశాఖ విశ్రాంత సంచాలకుడు వి.డి.రాజగోపాల్‌పై ఎన్‌బీడబ్ల్యూ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • హత్యాచార నిందితుడు ఆత్మహత్య
    తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సైదాబాద్‌ హత్యాచార ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్​ఘన్‌పూర్‌ సమీపంలోని నష్కల్‌ రైల్వే స్టేషన్‌ వద్ద రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఎడమచేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా ఆత్మహత్యకు పాల్పడింది రాజేనని పోలీసులు నిర్ధరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు..!
    బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై (Mamata Banerjee).. ఎన్నికల కమిషన్​కు(ఈసీ) ఫిర్యాదు చేసింది రాష్ట్ర భాజపా. భవానీపుర్​​ ఉప ఎన్నిక (Bhabanipur election) ప్రచారంలో ఈసీ విధించిన కొవిడ్​ నిబంధనలను సీఎం ఉల్లంఘించారని ఆరోపించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'రాబోయే 3 నెలలు జాగ్రత్త'
    దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి(Covid in India) స్థిరంగా ఉందని కేంద్రం(Centre on Covid) వెల్లడించింది. రాబోయే మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు(Centre Warns States) హెచ్చరించింది. ఈ మేరకు దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • చైనా వెన్నులో వణుకు!
    భారత్​ అగ్ని-వీ బాలిస్టిక్ క్షిపణి(Ballistic missile) ప్రయోగాన్ని త్వరలో చేపట్టనున్న నేపథ్యంలో.. చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. దక్షిణాసియాలో శాంతి భద్రతల కోసం అన్ని దేశాలు కృషి చేయాలని పేర్కొంది. మరోవైపు.. బ్రిటన్​, అమెరికా, ఆస్ట్రేలియా కలిసి ఏర్పాటు చేసిన ఆకస్(ఏయూకేయూఎస్​) కూటమిని విమర్శించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఎస్​బీఐ బంపర్​ ఆఫర్
    ​దేశీయ అతిపెద్ద బ్యాంక్​ ఎస్​బీఐ పండుగ బొనాంజా (SBI Festive offers) ఆఫర్లు ప్రకటించింది. హోం లోన్స్​పై వడ్డీ (SBI loan) రేట్లను 45 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినట్లు తెలిపింది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా వడ్డీ తగ్గింపు వర్తించనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • టీ20 కెప్టెన్సీకి గుడ్​బై
    అనుకున్నట్లే జరిగింది. టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ కీలక ప్రకటన చేశాడు. టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్​ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. పని ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. దీంతో టీ20 జట్టుకు రోహిత్‌ శర్మను సారథిగా నియమించే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • సినిమా కబుర్లు​
    కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఇందులో 'మళ్ళీ మొదలైంది', 'ఆకాశవాణి', 'లవ్​స్టోరీ', నిర్మాత బండ్లగణేశ్​ నటిస్తున్న కొత్త మూవీ వివరాలు ఉన్నాయి. అవన్నీ మీ కోసం.. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details