- బెయిల్ రద్దుకు నిరాకరణ
అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దుకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుకూ సీబీఐ కోర్టు నిరాకరించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- హైకోర్టు ఆగ్రహం
ఉపాధి హామీ పెండింగ్ బిల్లులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులపై అఫిడవిట్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని.. ధర్మాసనం ఆదేశించింది. వచ్చే నెల 4న పూర్తి వివరాలతో కోర్టుకు రావాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అరెస్టుకు రంగం సిద్ధమైందా..!
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 100వ రోజు కొనసాగింది. అందులో భాగంగా.. వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని కడపలో సాయంత్రం నుంచి సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎర్ర గంగిరెడ్డికి కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'విశాఖ రైల్వే స్టేషన్ మొదటి స్థానం'
విశాఖ రైల్వే స్టేషన్‌లో పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కితాబిచ్చారు. పరిశుభ్రతలో దేశంలోనే విశాఖ రైల్వే స్టేషన్ మొదటి స్థానంలో ఉందని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'భారత్.. ప్రజాస్వామ్యానికి అమ్మ లాంటిది'
సంసద్ టీవీ ఛానెల్‌ను (sansad tv launch) ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. పార్లమెంట్ విధానంలో మరో కీలక ఘట్టంగా పేర్కొన్నారు మోదీ. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఐరాస వేదికగా చురకలు!
ఉగ్రవాదులకు పాకిస్థాన్ బహిరంగంగా మద్దతు తెలుపుతోందని ఐరాస మానవ హక్కుల కౌన్సిల్లో(UN Human Rights Council) భారత్ ఆరోపించింది. ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తోందని విమర్శించింది. ఉగ్రమూలాలకు పుట్టినిల్లైన పాక్ నుంచి నీతి పాఠాలు నేర్చుకునే స్థితిలో భారత్ లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- తాలిబన్ల హుకుం- తిరగబడ్డ జనం
మూడు రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాలంటూ తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలపై (Taliban Kandahar) కాందహార్ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. 20 ఏళ్లగా తాము ఇక్కడే ఉంటున్నామని.. ఇప్పుడు తాలిబన్లు తమను ఖాళీ చేయమనడం సరికాదని అంటున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- స్టాక్ మార్కెట్ల కొత్త రికార్డు
స్టాక్ మార్కెట్లు (Stocks Today) మరోసారి రికార్డు సృష్టించాయి. బుధవారం సెషన్లో సెన్సెక్స్ (Sensex Today) 476 పాయింట్లు పెరిగి.. జీవనకాల గరిష్ఠమైన 58,700 మార్క్‌ను దాటింది. నిఫ్టీ (Nifty Today) 139 పాయింట్లు బలపడి సరికొత్త రికార్డు స్థాయి అయిన 17,500పైకి చేరింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'అత్యుత్తమ కెప్టెన్ అతడే!'
టీమ్ఇండియా మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీలలో గొప్ప కెప్టెన్(Team India Best Captain) ఎవరనే ప్రశ్నకు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర సమాధానమిచ్చాడు. వారిద్దరిలో ఒకరు జట్టును కొత్తగా పరిచయం చేస్తే.. మరొకరు ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టారని వెల్లడించాడు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఐటీ సోదాలు
ప్రముఖ నటుడు సోనూసూద్‌కు చెందిన కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు చేపట్టింది. ఈ మేరకు ముంబయి, లఖ్‌నవూలోని సోనూసూద్‌కు చెందిన ఆరు చోట్ల తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పన్ను ఎగవేత దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.