ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9AM

.

top news at 9am
ప్రధాన వార్తలు @ 9AM

By

Published : Dec 18, 2020, 9:01 AM IST

  • ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్ భేటీ

పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ.5 వేల కోట్ల రుణ సమీకరణ సహా కీలక నిర్ణయాలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. మెడికల్ కళాశాలల నిర్మాణానికి రాష్ట్ర వైద్యవిద్య పరిశోధన కార్పొరేషన్ ఏర్పాటు అంశంపైనా చర్చించనున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వృత్తిజీవితం చివరిదశలో కొత్త విషయం

వివిధ వ్యాజ్యాల్లో తనను విచారణ నుంచి తప్పుకోవాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ పిటిషన్లు దాఖలు చేయడంపై.... జస్టిస్ రాకేశ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తి జీవిత చివరి దశలో కొత్త విషయం తనకు అనుభవంలోకి వచ్చిందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రాణ త్యాగానికైనా సిద్ధం: సీపీఐ నారాయణ

రైతుల పక్షాన నిలబడి ప్రాణత్యాగానికైనా సిద్ధమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉద్ఘాటించారు. మహిళలను ఎంత ఏడిపిస్తే ఈ సీఎంకు అంత ప్రమాదమని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నిష్పాక్షిక విచారణ సాధ్యపడదు

రాజ్యాంగ విచ్ఛిన్నం వ్యవహారంపై కేసుల్లో జస్టిస్ రాకేశ్​కుమార్​ను విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ... హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు. ప్రభుత్వ పాలనపై పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సాగు చట్టాల ప్రయోజనాలపై నేడు మోదీ ప్రసంగం

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల కలిగే లాభాలపై ప్రధాని మోదీ ప్రసంగం ఇవ్వనున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అసంతృప్త నేతలతో భేటీ కానున్న సోనియా

కాంగ్రెస్​లో లోపాలపై విమర్శలు చేస్తూ లేఖ రాసిన సీనియర్​ నేతలతో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చర్చలు జరపనున్నారు. విపక్ష నేత గులాం నబీ ఆజాద్​ సహా పలువురితో వరుస భేటీలు నిర్వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కేరళ 'స్థానిక' విజయం దేనికి సంకేతం?

కేరళ ప్రజలు వామపక్ష రథమెక్కడానికే మొగ్గు చూపారు. ఇటీవలే జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎల్​డీఎఫ్​ తిరుగులేని విజయం సాధించడమే ఇందుకు నిదర్శనం. అయితే ఈ గెలుపు.. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్​డీఎఫ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు లభించిన ప్రమోదమని విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'డ్రాగన్​'తో సహకారం.. భారత్​కు ఇబ్బందికరం

రష్యా భారత్​ల మధ్య బంధం ప్రత్యేకమైనదని అని అనడంతో అతిశయోక్తి లేదు. ఎన్నో సందర్భాల్లో రష్యా భారత్​కు అండగా నిలిచింది. కానీ ఎన్ని సత్సంబంధాలు ఉన్నా బెడిసికొట్టే అవకాశాలు లేకపోలేదు. ఇందుకు ప్రస్తుత పరిస్థితులే ఉదాహరణ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రూ. లక్ష కోట్ల దివీస్​.. మార్కెట్​ విలువలో రికార్డు

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దివీస్‌ లేబొరేటరీస్‌ కొత్త రికార్డు సృష్టించింది. స్టాక్​మార్కెట్లలో ఆ సంస్థ షేరు ధర రూ.3,800 ను అధిగమించింది. దీంతో మార్కెట్ విలువలో రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీగా అవతరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పేరు, జెండా లేకుండానే ఒలింపిక్స్​లో రష్యా

రాబోయే రెండు ఒలింపిక్స్​ లేదా రెండేళ్లలో జరిగే ప్రపంచ ఛాంపియన్​షిప్​లలో రష్యా పేరు, ఆ దేశపు జెండా ఉపయోగానికి నిషేధం పడింది. క్రీడాకారులను డోపింగ్​కు ప్రోత్సహించిందన్న అభియోగాలు రుజువు కావడం వల్ల ఆర్బిట్రేషన్​ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'సాగరకన్యలున్న మాట వాస్తవమే!'

సాగరకన్యలు ఉన్నది నిజమే అంటోంది కథానాయిక హన్సిక. ప్రస్తుతం మాల్దీవుల పర్యటనలో ఉన్న హన్సిక.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు అక్కడికి వెళ్లడంపై కామెంట్​ చేసింది. సాగరకన్యలు నిజంగా ఉన్నాయంటూ సరదాగా వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details