- కాస్త ఉపశమనం
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 13,756 కరోనా కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 1,73,622 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో పశ్చిమగోదావరి జిల్లాలో 20 మంది మృతి చెందారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రహస్య ప్రాంతానికి ఆనందయ్య
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి రహస్య ప్రాంతానికి ఆనందయ్య తరలించారు. తెల్లవారుజామున ప్రత్యేక పోలీసు బందోబస్తుతో తీసుకెళ్లారు. ఆనందయ్య మందు కోసం.. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు కృష్ణపట్నం వస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- తితిదే ప్రకటన ఖండన
ఆంజనేయుడి జన్మస్థలంపై నెలకొన్న వివాదం.. ఇప్పట్లో సమసిపోయేలా లేదు. తిరుగిరుల్లోని అంజనాద్రే హనుమద్ జన్మస్థలమని తితిదే చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తున్న హనుమద్ జన్మభూమి తీర్థట్రస్ట్.. గురువారం నాటి సంవాదం తర్వాత.. తమవాదనే నెగ్గిందని తితిదే పండిత పరిషత్ చేసిన ప్రకటనను ఖండించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వాన కబురు
మే 31 నాటికి కేరళలో రుతుపవనాలు రాకకు అనుకూల వాతావరణం ఏర్పడినట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తెలంగాణ, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అనాథ చిన్నారులకు అండ
ఎన్డీఏ కూటమి రెండోసారి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న క్రమంలో కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల సంక్షేమం కోసం కీలక ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 18 ఏళ్లు దాటిన తర్వాత రూ.10 లక్షల సాయంతో పాటు పైచదువులకు హామీ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'మోదీ కాళ్లు పట్టుకునేందుకూ సిద్ధమే!'