- కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్...
హైదరాబాద్ బోయిన్పల్లి కిడ్నాప్ కేసు వివరాలను హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్ వ్యవహారంలో ఏ-1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ-2గా మాజీ మంత్రి అఖిలప్రియ, ఏ-3గా ఆమె భర్త భార్గవరామ్ ఉన్నారని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- లోపం ఎక్కడ?: పవన్..
రాష్ట్రంలో గత రెండేళ్లలో వందకుపైగా ఆలయాలపై దాడులు జరిగితే... ఒక్క నిందితుడినీ పోలీసులు పట్టుకోలేదంటే లోపం ఎక్కుడుందో సీఎం చెప్పాలని...జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. దాడులపై మాట్లాడితే రాజకీయ గెరిల్లా వార్‌ఫేర్ అంటూ విమర్శలు చేయటం తగదన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కేంద్రం తీపి కబురు...
కేంద్రం నిర్దేశించిన నాలుగు సంస్కరణల అమల్లో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అగ్రభాగంలో నిలిచాయి. ఇందుకుగానూ ఆయా రాష్ట్రాలకు మూలధన వ్యయం కోసం ప్రత్యేక సహాయంగా వెయ్యి నాలుగు కోట్లు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ ప్రకటించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఇళ్ల పట్టాల పంపిణీలో రికార్డింగ్ డ్యాన్సులు.. !
ప్రకాశం జిల్లా పామూరు మండలం గుమ్మలంపాడు గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. అయితే కొందరు పార్టీ నాయకులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా.. అవి కాస్త శ్రుతిమించి రికార్డింగ్ డ్యాన్సుల స్థాయిని తలపించటంతో.. విమర్శలకు దారితీసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- గురువారం కీలక భేటీ...
త్వరలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గురువారం సమావేశం కానున్నారు. జనవరి 8న దేశంలోని అన్ని జిల్లాల్లో రెండో దశ డ్రైరన్ ప్రారంభం కానున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'రిహార్సల్‌లా ట్రాక్టర్ ర్యాలీ'