- సీఎం సమాధానం చెప్పాలి.
డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి, ఏపీ పోలీస్ వ్యవస్థకు చెంపపెట్టని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌కు కసరత్తు
పీజీ మెడికల్ మొదటి విడత కౌన్సెలింగ్‌కు విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కసరత్తులు ముమ్మరం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం..
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సస్పెన్షన్ ఎత్తివేత
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. రక్షణ పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. దీనిపై ఏబీవీ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా క్యాట్ ఆయన సస్పెన్షన్‌ను సమర్ధించింది. దీనిపై ఏబీవీ వేసిన రిట్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆయనపై క్యాట్ ఉత్తర్వులను ఎత్తివేస్తూ ఆదేశాలిచ్చింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కూలీల తరలింపునకు ఏర్పాట్లు
వలస కార్మికుల తరలింపునకు బస్సులు, రైళ్లు ఏర్పాట్లు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 2 లక్షల మంది ప్రాణాలు సురక్షితం!