ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3PM - ap top ten news

.

TOP NEWS @3PM
TOP NEWS @3PM

By

Published : Nov 16, 2021, 2:59 PM IST

  • NARA LOKESH: 'మూడు జన్మలెత్తినా.. మూడు రాజధానులు కట్టలేరు..!'
    జ‌గ‌న్‌రెడ్డి, ఆయ‌న మంత్రులు మ‌రో మూడు జ‌న్మలెత్తినా.. మూడు రాజ‌ధానులు క‌ట్టలేరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం 700 రోజులకు చేరిందని.. వారి విజయం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Somu Veerraju On Amaravati : అమరావతి పాదయాత్రకు మద్దతు - సోము వీర్రాజు
    ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై తాము పోరాడతామని భాజపా నేత సోము వీర్రాజు స్పష్టం చేశారు. పోరాట కార్యాచరణపై ఈనెల 26న ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలిపారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Municipal Elections : మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి : ఎస్‌ఈసీ
    మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్‌ఈసీ నీలం సాహ్ని తెలిపారు. ఎక్కడా రీ-పోలింగ్ చేయాలని వినతులు రాలేదన్నారు. రేపు ఉదయం 8 నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని సాహ్ని వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ
    స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నోటిఫికేషన్‌ జారీచేశారు. విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండు చొప్పున స్థానాలకు.. అనంత, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒక్కో స్థానానికి నోటిఫికేషన్ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'వారిది మాఫియావాదం.. మాది అభివృద్ధి నినాదం'
    ఉత్తర్​ప్రదేశ్​ సుల్తాన్​పుర్​ జిల్లా పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వేను ప్రారంభించారు మోదీ. ఈ క్రమంలో గత పాలకులపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఓ భాగాన్ని.. మాఫియాకు రాసిచ్చేశారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టైర్ పేలి వాహనం బోల్తా- ఐదుగురు మృతి
    టైర్ పేలి, వాహనం బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మహారాష్ట్రలో ఈ దుర్ఘటన జరిగింది. బిహార్​లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'సంపద'లో అమెరికాను దాటేసిన చైనా- షాకింగ్ లెక్కలివే...
    సంపద విషయంలో అగ్రరాజ్యం అమెరికాను చైనా దాటేసింది. 20ఏళ్లలో చైనా సంపద 7 ట్రిలియన్​ డాలర్ల నుంచి 120 ట్రిలియన్​ డాలర్లకు చేరగా.. అమెరికా సంపద 90 ట్రిలియన్​ డాలర్లకు పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కియా నుంచి మరో కొత్త మోడల్.. లాంచ్ ఎప్పుడంటే...
    అధునాతన ఫీచర్లతో పెద్ద ప్యామిలీకి సరిపడే సరికొత్త వాహనాన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు కియా ఇండియా తెలిపింది(kia new car in india). ఇది ఆటోమొబైల్ రంగంలో గేమ్ ఛేంజర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఆ నినాదాలు నా శ్వాస ఆగేవరకు వినిపిస్తూనే ఉంటాయి'
    భారత క్రికెట్​ అభిమానుల గుండె పగిలిన రోజు ఇది. క్రికెట్ గాడ్ అని ముద్దుగా పిలుచుకునే సచిన్.. ఆటకు వీడ్కోలు చెప్పి నేటికి(నవంబరు 16) ఎనిమిదేళ్లు అయింది. ఈ సందర్భంగా ఆనాటి విశేషాలు మరోసారి మీకోసం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'చిరు చేయలేకపోయారు.. అందుకే చరణ్​తో ఆ సీన్ చేయించా'
    'మగధీర'లోని చరణ్​ను గుర్రం కాపాడే సీన్​ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు దర్శకుడు రాజమౌళి. చిరంజీవి సినిమా నుంచి దానిని స్ఫూర్తి పొంది తెరకెక్కించానని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details