ప్రధాన వార్తలు @ 1pm
By
Published : Jun 16, 2021, 12:59 PM IST
| Updated : Jun 16, 2021, 1:57 PM IST
- 'విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో ఆటలొద్దు'
'ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు - విద్యా సంవత్సరం వృథా' అనే అంశంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులతో పలు అంశాలపై చర్చించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మండలికి నలుగురు కొత్త సభ్యుల నామినేట్
ఏపీ శాసన మండలి నలుగురు కొత్త సభ్యులను నామినేట్ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సభ్యులుగా తోట త్రిమూర్తులు, లేళ్ళ అప్పిరెడ్డి, మోసేన్ రాజు, రమేష్ యాదవ్ ఉన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 10వ రోజు సీబీఐ విచారణ
మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 10వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ విచారణ చేపట్టింది. చిట్వేలి మండలానికి చెందిన వైకాపా నాయకులు లక్ష్మీకర్, రమణను అధికారులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు
విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మంప పీఎస్ పరిధిలో ఎదురుకాల్పులు కలకలం సృష్టించాయి. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ట్విట్టర్‌కు మరిన్ని చిక్కులు
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి ఘటనకు సంబంధించి ట్విట్టర్, ఓ న్యూస్ వెబ్సైట్ సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు ఘజియాబాద్ పోలీసులు. ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఆ వీడియోలో ఎలాంటి మతపరమైన కోణం లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కొత్తగా గ్రీన్ ఫంగస్
కొవిడ్ నుంచి కోలుకున్నవారిలో బ్లాక్, వైట్, ఎల్లో, క్రీమ్ ఫంగస్ కేసులు వెలుగుచూశాయి. కొత్తగా మధ్యప్రదేశ్ ఇందోర్‌లో ఓ వ్యక్తికి గ్రీన్ ఫంగస్ సోకింది. అయితే.. ఈ వైరస్ ప్రభావం రోగులపై ఎంతగా ఉందనేది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మనకు ఆకలి కేకలు తప్పవు: కిమ్
దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కొవిడ్-19 ఆంక్షలు మరోసారి పొడిగించిన దృష్ట్యా.. రాబోయే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- బంగారం కాస్త ప్రియం
హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాల్లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర బుధవారం కాస్త పెరిగింది. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. మరి ఆయా నగరాల్లో బంగారం ధరలు ఎంత ఉన్నాయి? పెట్రోల్ ధరలు ఎంత పెరిగాయి? అనే వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రోహిత్ శర్మ వాచ్ ధర అంత ఖరీదా?
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్లలో రోహిత్ శర్మ ఒకడు! బీసీసీఐ ఏ ప్లస్ కాంట్రాక్ట్, ఐపీఎల్లో అత్యధిక పారితోషికం, అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసిడర్.. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్నాడు హిట్‌మ్యాన్. ఈ నేపథ్యంలో ఇతడి దగ్గర ఉన్న విలాసవంతమైన వస్తువుల్లో కొన్నింటి గురించే ఈ స్టోరీ. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఓటీటీలో 'మోసగాళ్లు'
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో 'గద్దలకొండ గణేష్', మోసగాళ్లు, తమిళనాడు రిలీఫ్ ఫండ్‌కు విజయ్ సేతుపతి విరాళం, తుఫాన్ రిలీజ్ తేదీకి సంబంధించిన సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
Last Updated : Jun 16, 2021, 1:57 PM IST