ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM - ఆంధ్రా ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు@ 9PM
ప్రధాన వార్తలు@ 9PM

By

Published : Sep 19, 2020, 8:59 PM IST

  • కొత్తగా 8,218 కరోనా కేసులు
    రాష్ట్రంలో కొత్తగా 8,218 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మెుత్తం బాధితుల సంఖ్య 6,17,776కి చేరింది. తాజాగా వైరస్​కు మరో 58 మంది మృతి చెందగా..మెుత్తం మృతుల సంఖ్య 5,302కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • టెండర్లు రద్దు
    ఎన్డీబీ నిధుల ద్వారా చేపట్టే రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టు టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రాజెక్టు కోసం వారంలో మరోసారి టెండర్లు పిలుస్తామని తెలిపింది. ఈ టెండర్లపై తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఉండేందుకే రీ టెండర్లు ఆహ్వానిస్తున్నామని ఆర్​ అండ్ బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • అర్హత లేదు
    పోలవరం ప్రాజెక్టు గురించి ప్రభుత్వం సమర్పించిన బిల్లుల్లో రూ.760 కోట్లకు అర్హత లేదని కేంద్రం పేర్కొంది. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రాజెక్టు ఖర్చుపై రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు సమర్పించిందని కేంద్రం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • 'దేవుడి సొమ్మును ప్రభుత్వానికి తరలిస్తున్నారు'
    తిరుమల శ్రీవారి సొమ్మును.. ప్రభుత్వానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భాజపా ఆరోపిస్తోంది. స్వామివారికి కానుకల రూపంలో వచ్చిన సొమ్మును ప్రభుత్వానికి వడ్డీకి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని భాజపా అధికార ప్రతినిధి, తితిదే బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • కేంద్రం పరిధిలోకి తీసుకురావాలి
    కేంద్ర, రాష్ట్ర లిస్టుల్లో కానీ... లేదా రెండింటి సంయుక్త లిస్ట్‌లో లేని రాజధాని తరహా అంశంలో తుది నిర్ణయం తీసుకునే అర్హత... 248 అధికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్.... లోక్‌సభ దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • ఒక్కరోజులో 93,337 కరోనా కేసులు
    భారత్​లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 93,337 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 1,247 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • అల్​ఖైదాకు చెందిన 9 మంది అరెస్ట్
    అల్​ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా కార్యకలాపాలు సాగిస్తోన్న 9 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. బంగాల్​, కేరళలో జరిపిన సోదాల్లో వీరు పట్టుబడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • తొలి కోస్ట్​ గార్డ్ అకాడమీ ఏర్పాటు
    దేశంలోనే తొలి కోస్ట్​ గార్డ్​ అకాడమీని కర్ణాటకలో ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్​ వేదిక తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
  • ఐపీఎల్​ 2020
    మహా ధమాకా మొదలైంది. యూఏఈ వేదికగా బయో బబూల్​లో ఐపీఎల్ మెుదలైంది. చెన్నై సూపర్ కింగ్స్- ముంబయి ఇండియన్స్ మధ్య పోరు నడుస్తోంది.. లైవ్ అప్​డేట్స్​ కోసం.. ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'నాన్న ఆహారం తీసుకుంటున్నారు'
    సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కాస్త కుదుటపడిందని చెప్పారు ఆయన తనయుడు ఎస్పీ చరణ్​. శుక్రవారం నుంచి ఆహారం తింటున్నారని తెలిపారు. రోజులో 15-20 నిమిషాలు వైద్యుల సాయంతో లేచి కూర్చొంటున్నారని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ABOUT THE AUTHOR

...view details