- 'అమూల్ రాకతో మరో పాల విప్లవం మొదలవుతుంది'
రాష్ట్రవ్యాప్తంగా పాలసేకరణకు సంబంధించి ఏపీ-అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ సచివాలయంలో ప్రారంభించారు. తొలివిడతలో చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో పాలసేకరణను సీఎం జగన్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవిష్కరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'అవినీతి జరిగిందని.. ఎందుకు రుజువు చేయలేకపోయారు?'
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో వైకాపా ప్రభుత్వం చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు రూపాయి ఖర్చు చేయలేదని ఆరోపించారు. పోలవరం నిర్మాణంలో అవినీతి జరిగిందని.. ఎందుకు రుజువు చేయలేకపోయాని చంద్రబాబు నిలదీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 నుంచి 30 వేలు ఇవ్వండి'
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలులో రైతులను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరామర్శించారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం రైతులకు ఏ మాత్రం సరిపోదని అభిప్రాయపడ్డారు. ఎకరానికి రూ.25 వేల నుంచి 30 వేల వరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలంగాణ: రేపటి నుంచి ఉదయం 6.30 - రాత్రి 9.30 వరకు మెట్రో రైల్
తెలంగాణ రాష్టం హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల సేవల సమయాన్ని అధికారులు పొడగించారు. రేపటి నుంచి ఉదయం 6.30 నిమిషాలకు నగరంలోని మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ప్రియాంక తప్పేం లేదు.. శ్రీకాంత్‌ను కఠినంగా శిక్షించండి'
విశాఖలోని థాంసన్ స్ట్రీట్ వద్ద ప్రియాంక అనే యువతిపై.. యువకుడు శ్రీకాంత్ దాడి చేసిన ఘటనపై.. బాధితురాలి కుటుంబీకులు తీవ్రంగా స్పందించారు. ప్రియాంకపై.. అన్యాయంగా దాడి చేశారని ఆవేదన చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'సాగు చట్టాల రద్దుకై పార్లమెంటును సమావేశపర్చండి'
దిల్లీ సరిహద్దుల్లో రైతులు కదం తొక్కుతున్నారు. వ్యవసాయ చట్టాలపై ఆగ్రహించిన అన్నదాతలు.. వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపర్చాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వంట గ్యాస్ మంట- భారీగా పెరిగిన ధర
వంట గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. రాయితీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని వెల్లడించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇజ్రాయెల్: పార్లమెంట్ రద్దు ప్రతిపాదనకు ఆమోదం
పార్లమెంట్ రద్దు ప్రతిపాదనను ఇజ్రాయెల్ శాసనకర్తలు ఆమోదించారు. ప్రభుత్వ ఏర్పాటులో పాలుపంచుకున్న బ్లూ అండ్ వైట్ పార్టీ సభ్యులు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. చివరి విడతలోనూ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే.. పార్లమెంట్‌కు మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీమ్ఇండియా తొలి విక్టరీ.. ఆసీస్‌పై అద్భుత విజయం
మూడో వన్డేలో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న కోహ్లీసేన.. క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. ఇదే ఊపును టీ20 సిరీస్‌లోనూ కొనసాగించాలని చూస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆస్కార్ పురస్కారాల వేడుక వర్చువల్‌గా ఉండదు'
వచ్చే ఏడాది జరగనున్న ఆస్కార్ పురస్కార వేడుకను వర్చువల్‌గా నిర్వహించబోమని ఆస్కార్ అకాడమీ బుధవారం ఓ ప్రకటనలో తెలియజేసింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ఈవెంట్‌ను కాస్త ఆలస్యంగా నిర్వహిస్తామని అకాడమీ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 9PM