- 'ఈ-క్రాప్ చేయకపోతే రైతులకు డబ్బులెవరిస్తారు..?'.. హోమంత్రి ఆగ్రహం
Sucharitha Fire On Agriculture Officers: వ్యవసాయశాఖ అధికారులపై హోమంత్రి మేకతోటి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆమె.. మిర్చికి ఈ-క్రాప్ చేయకపోవటంపై మండిపడ్డారు. ఈ-క్రాప్ చేయకపోతే రైతులకు ఎవరు డబ్బులు ఇస్తారని అధికారులను ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విశాఖ రైల్వే జోన్ కు పచ్చజెండా.. ముందుకు కదిలినట్టేనా?
విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో తెదేపా ఎంపీలు, వైకాపా సభ్యులు గడిచిన రెండు రోజులుగా లేవనెత్తుతున్నారు. అయితే.. రైల్వే జోన్‌పై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని చెబుతూ వచ్చిన మంత్రి అశ్విని వైష్ణవ్.. తాజాగా చర్యలు చేపడతామని చెప్పడం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Nara Lokesh: సంక్షేమ పథకాల్లో కోతలకే.. ఆ నిబంధన : లోకేశ్
ప్రభుత్వం తెచ్చిన నిబంధనలు.. వేలాదిమంది గిరిజనులకు పింఛను, రేషన్ రాకుండా చేస్తున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు లోకేశ్ లేఖ రాశారు. సంక్షేమ పథకాల్లో కోత పెట్టేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో కొత్త కరోనా రూల్స్.. అలా చేస్తే 25 వేల జరిమానా!
Covid guidelines: రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం మరోమారు మార్గదర్శకాలు విడుదల చేసింది. మాస్కు లేని వారిని.. దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే సదరు యాజమాన్యానికి రూ.10 వేల నుంచి 25 వేల రూపాయల మేర జరిమానా విధించాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహించటం గర్వంగా ఉంది'
Democracy summit 2021: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత స్వాతంత్ర్యం ప్రపంచానికి కీలక సందేశాన్ని అందించినట్లు చెప్పారు. అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వీరుడా వందనం'.. రావత్‌కు జనభారతం తుది వీడ్కోలు
Bipin Rawat funeral: దిల్లీలోని బార్ స్క్వేర్ శ్మశానవాటికలో.. సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలు, బంధుమిత్రల అశ్రునయనాల మధ్య జరిగాయి. కుటుంబసభ్యులు, ప్రజలు రావత్ దంపతులకు కన్నీటి వీడ్కోలు పలికారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ప్రజలు మాస్కులు వేసుకోవట్లేదు.. ఇలా ఉంటే కష్టమే'
Ministry of Health on Omicron: భారతదేశంలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో చాలా మందిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని 19 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతానికి చేరిందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించిన గూగుల్
Google Bonus For Employees: టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్.. ఉద్యోగులకు భారీ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. సుమారు 1600 డాలర్లను బోనస్‌గా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- MSK Prasad on Rahane: 'రహానేను అందుకే ఎంపిక చేశారు'
MSK prasad on Rahane: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా సీనియర్ ఆటగాడు అజింక్య రహానేకు అవకాశం రావడంపై స్పందించాడు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. విదేశీ పిచ్‌లపై రహానే మెరుగ్గా రాణించగలడని అన్నాడు. అందుకే సెలెక్టర్లు అతడికి అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చిరు- బాలయ్య మల్టీస్టారర్.. 'మైత్రీ' ప్రొడ్యూసర్స్ క్లారిటీ!
Balayya Chiru Combination: మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అయితే ఇదే విషయంపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.