ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 7PM - ఏపీ టాప్ వార్తలు

..

ప్రధాన వార్తలు@ 7PM
ప్రధాన వార్తలు@ 7PM

By

Published : Oct 3, 2020, 7:15 PM IST

  • కొత్తగా 6,224 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 6,224 కరోనా కేసులు, 41 మరణాలు నమోదయ్యాయి. మెుత్తం బాధితుల సంఖ్య 7,13,014కి చేరింది. ఇప్పటివరకు వైరస్​ కారణంగా 5,941 మంది మృతి చెందారు. ప్రస్తుతం 55,282 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

మంత్రి కృష్ణదాస్‌పై ఫిర్యాదు కోసం వెళ్లిన తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలీసుస్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెదేపా, వైకాపా శ్రేణులు భారీగా స్టేషన్​కు తరలివచ్చిన కారణంగా.. కాసేపు గందరగోళం నెలకొంది. తెదేపా నేతల ఆందోళలనతో పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • వైకాపాలో వర్గ విభేదాలు

కృష్ణా జిల్లా గన్నవరం వైకాపాలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే వైకాపాకు మద్దతు ప్రకటించినప్పటి నుంచి... ఎప్పటినుంచో వైకాపాలో ఉన్న వర్గంతో విభేదాలు తలెత్తుతున్నాయి. తాజాగా కాకులపాడులో గ్రామ సచివాలయానికి శంకుస్థాపన విషయంలో మరోసారి వివాదం తలెత్తింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల్లో రోజువారీ విచారణ

ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల అంశంలో రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారించాలని.. సీబీఐ, అనిశా, ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులు విచారిస్తున్న ప్రత్యేక కోర్టులకు ఆదేశాలిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఆర్జేడీ-144, కాంగ్రెస్​-70 స్థానాల్లో పోటీ

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఆర్జేడీ, కాంగ్రెస్​, వామపక్షాలు కలిసే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. అత్యధికంగా రాష్ట్రీయ జనతా దళ్​-144 స్థానాల్లో బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్​ 70 చోట్ల పోటీ చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • బాధితురాలి బంధువు కిడ్నాప్​!

యూపీ ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి బంధువు అపహరణకు గురయ్యారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల కుటుంబంపై అనుమానం వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • మయన్మార్​ పర్యటనకు ఆర్మీ చీఫ్​

భారత సైన్యాధిపతి జనరల్​ ఎంఎం. నరవాణే ఆదివారం నుంచి 2 రోజుల పాటు మయన్మార్​లో పర్యటించనున్నారు. విదేశాంగ కార్యదర్శి హర్ష్​వర్ధన్​ ష్రింగ్లా కూడా ఆయనతో పాటు వెళ్లనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఇకనైనా తీవ్రంగా పరిగణించండి

వైరస్​ను తీవ్రంగా పరిగణించాలనేందుకు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడటం ఓ గట్టి సూచన వంటిదని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ పేర్కొన్నారు. అందరూ మాస్కు ధరించి, సురక్షిత దూరం పాటించాలని కోరారు. మాస్కు ధరిస్తే వేలాది మంది ప్రాణాలు కాపాడొచ్చని చెప్పారు. ట్రంప్ కోలుకోవాలని ప్రార్థించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • సుశాంత్​ది ఆత్మహత్యే

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ రాజ్​పుత్ శవపరీక్షను విశ్లేషించిన ఎయిమ్స్​ ఫోరెన్సిక్​ బృందం.. అతడిది ఆత్మహత్యే అని స్పష్టం చేసింది. అతడికి విషం ఇవ్వడం, గొంతు నులిమి చంపడం వంటివి జరగలేదని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • కోచ్ విచిత్ర సమాధానం

బ్యాటింగ్ ఆర్డర్లో ధోనీ దిగువన రావడంపై క్రికెట్ అభిమానుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై చెన్నై కోచ్ ఫ్లెమింగ్​ను ప్రశ్నించగా.. అతడు విచిత్రమైన సమాధానం చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ABOUT THE AUTHOR

...view details