ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 7PM - ఈటీవీ భారత్ ప్రధాన వార్తలు

.

TOP NEWS 7PM
TOP NEWS 7PM

By

Published : Jul 30, 2020, 7:00 PM IST

  • దుర్గమ్మ ఆలయ అభివృద్ధిపై దృష్టి

విజయవాడ దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులపై పాలకమండలి దృష్టి సారించింది. దాతల నుంచి సహాయం పొందేందుకు ప్రత్యేక సెల్​ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దర్శనం క్యూలైన్లలో మార్పులు, శాశ్వత కేశ ఖండనశాల ఏర్పాటుకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఈనాడు కథనాలకు స్పందన

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి..కరోనా లాక్ డౌన్ కారణంగా తిరుపతిలో చిక్కుకుపోయిన రష్యన్ యువతి ఎస్తేర్​పై ఈనాడు- ఈటీవీ ప్రసారం చేసిన కథనానికి స్పందన వెల్లువెత్తుతూనే ఉంది. ఆమెను ఆదుకునేందుకు మానవత్వంతో పలువురు స్పందిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఇంట్లోనే కరోనా బాధితుడు

కాకినాడలో ఓ కరోనా బాధితురాలు తన ఇంట్లోనే మృతి చెందింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. సత్వర వైద్యం అంది ఉంటే ఆమె బతికేదని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఇసుక దందా

తీసుకున్న బిల్లు కంటే ఎక్కువగా ఇసుకను తరలించిన ముఠాను కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 175 టన్నుల ఇసుక, టిప్పర్​ను సీజ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • రాముడికి ముస్లిం మహిళల రాఖీలు

ఉత్తర్​ప్రదేశ్ అయోధ్య ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళలు రాముడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ కోసం ప్రత్యేకంగా రాఖీలు సిద్ధం చేస్తున్నారు. ఈ రాఖీలను పోస్ట్ ద్వారా పంపించనున్నారు. రామ మందిర భూమి పూజ సందర్భంగా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ సభ్యుల ద్వారా రాముడికి ధరింపజేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • పబ్​జీపై వేటు..!

దేశ సార్వభౌమత్వానికి ముప్పుగా మారాయని పలు చైనా యాప్​లపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం.. పబ్​జీపైనా వేటు వేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వీడియో గేమ్​తో దేశ భద్రతకే కాకుండా మానసిక ఆరోగ్యానికి ఇబ్బందులు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • అక్కడ లాక్​డౌన్​

వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31 వరకు లాక్​డౌన్​ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఆరంభ లాభాలు ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్​, ఇంధన రంగ షేర్లపై అమ్మకాల ఒత్తిడితో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. సెన్సెక్స్ 335, నిఫ్టీ 101 పాయింట్లు నష్టపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • నింగిలోకి పర్సీవరెన్స్‌ మార్స్‌ రోవర్

అంగారక గ్రహంపై పరిశోధనల కోసం పర్సీవరెన్స్‌ మార్స్‌ రోవర్‌ను నింగిలోకి పంపింది అగ్రరాజ్యం అమెరికా. యూఏఈ, చైనాలు ఇప్పటికే ఈ ప్రయోగాన్ని ప్రారంభించాయి. ప్రాచీన జీవజాతి మనుగడపై అన్వేషణే లక్ష్యంగా సాగుతోంది ఈ మిషన్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • పవర్ స్టార్​తో రకూల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్​తో క్రిష్​ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. వెబ్​సిరీస్​లకు కథలు అందించే పనిలోనూ ఉన్నారు. ఈ నేపథ్యంలో క్రిష్​ ఓ పాత్ర కోసం రకుల్​ప్రీత్​ను కలిసినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ABOUT THE AUTHOR

...view details