ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM - 1PM ప్రధాన వార్తలు

.

top news 1PM
top news 1PM

By

Published : May 16, 2020, 1:00 PM IST

  • కొత్తగా 48 కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 2205కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • అడ్డగింత

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ వద్ద ఆవ భూముల పరిశీలనకు వెళ్తున్న తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అయినా.. నేతలు వెనక్కి తిరిగి వెళ్లకుండా వాహనాలు వదిలి నడిచి వెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • లడ్డు కావాలా?

తిరుపతి లడ్డు ప్రసాదం అందుబాటులోకి రావటంతో భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. సుమారు 50 రోజుల తరువాత స్వామి వారి ప్రసాదం అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాల కోస క్లిక్ చేయండి..

  • వామ్మో.. చికెన్​ ధర

ఇప్పటికే కొండెక్కిన కోడిమాంసం ధర మరింత పెరిగింది. వేసవి కాలంలో గతంలో ఎప్పుడూ చికెన్​ కిలో రూ.246 దాటలేదు. శుక్రవారం స్కిన్‌లెస్‌ కిలో రూ.257కు చేరడం ఆల్‌టైమ్‌ రికార్డుగా పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ట్రక్కు బోల్తా-వలస కూలీలు మృతి

మధ్యప్రదేశ్​ సాగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వలస కూలీలు మృతి చెందారు. మరో 17 మంది క్షతగాత్రులయ్యారు. వీరంతా మహారాష్ట్ర నుంచి ఉత్తర్​ప్రదేశ్ వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • సినీ మాస్క్

రొటీన్​ మాస్కులు ధరించి బోర్​ కొడితే.. ఇక రజినీకాంత్​ను ముఖంపై పెట్టుకు తిరగొచ్చు. కమల్​హాసన్​ను మూతికి చుట్టుకోవచ్చు. తమిళనాడులో ఓ వస్త్ర పరిశ్రమ తయారు చేసిన ఆ సినీతారల మాస్కులు​ ఇప్పుడు ట్రెండింగ్​లో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • మొబైల్​ ఫోన్​తో వైరస్​!

మీ మొబైల్​ ఫోన్​ వైరస్​ను అంటించే ప్రమాదముంది. ఒక్కసారి ఫోన్​పై వాలిన వైరస్​ సరాసరీ చేతులకు, మొహానికి తాకుతుంది. అందుకే ఆసుపత్రుల్లో మొబైల్‌ ఫోన్లే ప్రధాన వైరస్‌ వాహకాలంటున్నారు వైద్యులు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • నేను మాట్లాడను:ట్రంప్

ప్రస్తుత సమయంలో చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​తో మాట్లాడదలుచుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ అన్నారు​. కరోనా కట్టడిలో నాయకత్వం వహించాలనుకుంటున్న చైనాపై తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి..

  • ఫిదా చేస్తోన్న ఈషా

హార్లీ డేవిడ్​సన్ బైక్​పై చక్కర్లు కొడుతోంది టాలీవుడ్ నటి ఈషా రెబ్బా. అందుకు సంబంధించిన వీడియోను తాజాగా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • టీ20 ప్రపంచకప్​ వాయిదా!

ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ నిర్వహణను 2022కు వాయిదా వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఐసీసీకి చెందిన ఓ సీనియర్​ అధికారి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ABOUT THE AUTHOR

...view details