ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM MEET: రేపు సీఎం సమావేశం.. "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంపై సమీక్ష..! - గుంటూరు జిల్లా తాజా వార్తలు

CM MEET: ప్రభుత్వ పరంగా చేపట్టిన "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంపై రేపు ఉదయం పదిన్నర గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించనున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన, సమస్యలు వాటి పరిష్కారం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు.

CM MEET
CM MEET

By

Published : Jun 7, 2022, 8:15 AM IST

CM MEET:ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఉదయం పదిన్నర గంటలకు మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. ప్రభుత్వ పరంగా చేపట్టిన "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంపై సీఎం సమీక్షించనున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతున్న తీరుపై నేతల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన, సమస్యలు వాటి పరిష్కారం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. కార్యక్రమానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి కీలక సూచనలు చేయనున్నారు. కార్యక్రమం అమలు తీరు సహా మరింత విజయవంతంగా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details