ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా గురించి అత్యవసర సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు

కరోనా వైరస్​పై వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆళ్లనాని సూచించారు. జిల్లాల వారీగా నోడల్ అధికారులను నియమించినట్టు వివరించారు. అత్యవసర సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

టోల్‌ఫ్రీ నంబర్లు
టోల్‌ఫ్రీ నంబర్లు

By

Published : Jan 31, 2020, 4:16 PM IST

కరోనా వైరస్​పై జిల్లాల వారీగా నోడల్ అధికారులను నియమించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో స్కానింగ్ పరికరాలు, మాస్క్‌లు ఉంచాలని ఆదేశించారు. 28 రోజులుగా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సమస్యలుంటే వైద్యుడిని కలవాలని ప్రజలను కోరారు. అత్యవసర సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు 1100, 1102 ఏర్పాటు చేశామన్నారు. 70133 87382, 80084 73799 నంబర్ల ద్వారా కూడా సహాయం పొందవచ్చని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details