విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలు, పెద్దరాజగోపురం, చిన్నరాజగోపురం, ప్రాకారాలు, మహా మండపం విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వెలుగులీనుతోంది. కేరళ బృందం వాయిద్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తొలిరోజు అమ్మవారిని 9వేల 215 మంది దర్శించుకున్నారు. నేడు బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది.
నేడు బాలా త్రిపుర సుందరీదేవిగా బెజవాడ దుర్గమ్మ - బాలా త్రిపుర సుందరీదేవిగా బెజవాడ దుర్గమ్మ
విజయవాడ దుర్గగుడిలో దసరా శరన్నవరాత్రులు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు బాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
నేడు బాలా త్రిపుర సుందరీదేవిగా బెజవాడ దుర్గమ్మ
TAGGED:
బెజవాడ దుర్గమ్మ తాజా వార్తలు