ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో మరో 56 కరోనా పాజిటివ్ కేసులు - total positive cases in telangana

తెలంగాణలో ఇవాళ మరో 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. తెలంగాణలో కొవిడ్-19‌ కేసుల సంఖ్య 928కి చేరింది. 711 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ 8 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 194 మంది బాధితులు ఇంటికి వెళ్లారు. 23 మంది మృతి చెందారు.

BREAKING
BREAKING

By

Published : Apr 21, 2020, 10:00 PM IST

తెలంగాణలో నేడు నమోదైన 56 కేసుల్లో.. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 26, జీహెచ్‌ఎంసీ పరిధిలో 19, నిజామాబాద్‌లో 3, గద్వాల, ఆదిలాబాద్‌లో ఇద్దరికి కొవిడ్‌ సోకింది. ఖమ్మం, మేడ్చల్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఒక్కో కరోనా పాజిటివ్ కేసు వచ్చిందని వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details