ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శివాలయాల్లో భక్తుల సందడి - latest news in anantapur

కార్తిక మాసం.. సోమవారాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు నూతన శోభను సంతరించుకున్నాయి. ఈ రోజు కార్తిక మాసం రెండో సోమవారం కావటంతో వేకువజాము నుంచే మహిళలు పుణ్య స్నానాలు ఆచరించి విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు. కార్తిక దీపాలు వెలిగించి... లింగమూర్తికి అభిషేకాలు జరిపారు.

celebrations in lord siva temple
శివ నామస్మరణతో మరుమ్రోగుతున్న ఆలయాలు

By

Published : Nov 23, 2020, 1:56 PM IST

Updated : Nov 23, 2020, 9:44 PM IST

కార్తిక మాసం సోమవారం సందర్భంగా.. రాష్ట్రంలోని ఆలయాలు ... శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. వేకువజాము నుంచే మహిళలు పుణ్య స్నానాలు ఆచరించి సర్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కార్తిక దీపాలు వెలిగించి...నీలకంఠునికి అభిషేకాలు జరిపారు.

  • కాశీ విశ్వేశ్వరాలయానికి పోటెత్తిన జనం..

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తిక మాసం రెండో సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి శివాలయం వద్ద భక్తుల సందడి కనిపించింది. మహిళలు దీపాలు వెలిగించి... స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

  • శ్రీకాళహస్తీశ్వరాలయం లో భక్తుల రద్దీ.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆలయ ఆవరణంలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.

  • త్రిపురాంతకే శ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి

ప్రకాశం జిల్లా జిల్లాలో ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. కార్తిక మాసం సోమవారం సందర్భంగా వేకువజాము నుంచే మహిళలు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్లు, దక్షిణామూర్తి విగ్రహాల వద్ద దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

  • టెక్కలి ఎండల మల్లికార్జున స్వామి శివ క్షేత్రంలో భక్త జన సందడి...

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలోని ఎండల మల్లికార్జున స్వామి శివ క్షేత్రంలో భక్త జన సందడి కనిపించింది. కార్తిక మాసం సోమవారం సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. కొవిడ్ నిబంధనలు ఉన్నా స్వామివారిని దర్శించుకునేందుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

  • పార్వతీపురం శివాలయాల్లో భక్తుల తాకిడి....

విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో కార్తిక మాసం సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంతోపాటు బలిజపేట, సీతానగరం మండలాల్లోని శివాలయాలు భక్తులతో రద్దీగా కనిపించింది . అభిషేకాలు , అష్టోత్తరాలతో భక్తులు ఈశ్వరుడిని కొలిచారు.

ఇదీ చదవండి:

పుష్కర స్నానం.. కార్తీక దీపం: వెల్లువెత్తిన భక్తజనం

Last Updated : Nov 23, 2020, 9:44 PM IST

ABOUT THE AUTHOR

...view details