ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Today Horoscope: ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..! - రాశిఫలాల వార్తలు

ఈ రోజు రాశిఫలాలు(Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Today horoscope in telugu
Today horoscope in telugu

By

Published : Jun 3, 2021, 6:35 AM IST

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.

మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. మీకు అనుకూలంగా అధికారులు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివాష్టకం పఠిస్తే మంచిది.

సకాలంలో పనులను పూర్తిచేస్తారు. బంధుమిత్రులను కలుపుకొనిపోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. శివారాధన చేస్తే మంచిది.

మధ్యమ ఫలితాలున్నాయి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టిన పనుల్లో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధుమిత్రులతో కలిసి గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుప్రీతి ఉంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధ్యైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ.. దైవారాధన మానవద్దు.

ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారముంది. నవగ్రహాలను పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలున్నాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

ధర్మచింతనతో వ్యవహరిస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.

శరీర సౌఖ్యం ఉంది. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. గిట్టని వారికి దూరంగా ఉండాలి. అన్నదానం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇష్టదైవాన్ని ప్రార్థించాలి.

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి మొదలు పెట్టాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

ఇదీ చూడండి:హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైన తితిదే

ABOUT THE AUTHOR

...view details