రాష్ట్రంలో కొత్తగా 2,886 కరోనా కేసులు, 17 మరణాలు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,20,565కు చేరింది. కొవిడ్‌తో ఇప్పటివరకు 6,676 మంది మృతి చెందారు. ప్రస్తుతం 25,514 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 7,88,375 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 84,401 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు మొత్తం 79.46 లక్షల మందికి టెస్టులు చేశారు.
రాష్ట్రంలో కొత్తగా 2,886 కరోనా కేసులు, 17 మరణాలు - రాష్ట్రంలో కరోనా కేసులు
17:13 October 30
తాజా కరోనా కేసులు
జిల్లాలవారీగా కేసులు...
గడిచిన 24 గంటల్లో పశ్చిమగోదావరి జిల్లాలో అధికంగా 493 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా 448, తూర్పుగోదావరి 405, గుంటూరు 385, చిత్తూరు 296, విశాఖ 152, అనంతపురం 151, కడప 148, ప్రకాశం 146, నెల్లూరు 80, శ్రీకాకుళం 77, విజయనగరం 69, కర్నూలు జిల్లాలో 36 కేసులు నమోదయ్యాయి.
జిల్లాలవారీగా కరోనా మృతులు...
కృష్ణా 3, అనంతపురం 2, చిత్తూరు 2, గుంటూరు 2, కడప 2, విశాఖ 2, ప్రకాశం 1, విజయనగరం 1, తూర్పుగోదావరి 1, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
ఇదీచదవండి