ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పొగాకు వల్ల వచ్చే దుష్పరిణామాలపై కార్యశాల

పొగాకు వల్ల వచ్చే దుష్పరిణామాలపై విజయవాడలో కన్జ్యూమర్ గైడెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యశాల నిర్వహించారు. మానవ శరీరంలోని ఊపిరితిత్తులపై పొగాకు ప్రభావం గురించి వివరించారు.

By

Published : Jun 1, 2019, 7:42 AM IST

పొగాకు వల్ల వచ్చే దుష్పరిణామాలపై కార్యశాల

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలో కన్జ్యూమర్ గైడెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో పొగాకు ఉత్పత్తుల వల్ల సమాజంలో ఏర్పడే చెడు పరిణామాలు పై కార్యశాల నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది పొగాకు ఉత్పత్తులను వాడి ఏ ఏ రుగ్మతలతో చనిపోతున్నారో తెలియజేశారు. మానవ శరీరంలోని ఊపిరితిత్తులపై పొగాకు ప్రభావం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యా వేత్తలు, వైద్యులు పాల్గొన్నారు. ఈ కార్యశాలలో మేధావుల, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని సంస్థ నిర్వాహకులు డాక్టర్ దివాకర్ బాబు తెలిపారు.

పొగాకు వల్ల వచ్చే దుష్పరిణామాలపై కార్యశాల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details