ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మద్యం దుకాణాల్లో పనికి పీహెచ్‌డీ అభ్యర్థి దరఖాస్తు! - కృష్ణాజిల్లా

ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే మద్యం దుకాణంలో పనిచేసేందుకు ఉన్నత విద్యావంతులు క్యూ కడుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో దాదాపు బీటెక్, మేనేజ్​మెంట్ అభ్యర్థుల విద్యార్హతలు చూసి అధికారులు నివ్వెరపోతున్నారు.

మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు..పోటీగా ఉన్నత విద్యావంతులు

By

Published : Sep 19, 2019, 9:52 AM IST

మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు..పోటీగా ఉన్నత విద్యావంతులు

ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు ఉన్నత విద్యావంతులు పోటీపడుతున్నారు. కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు ఎంబీఎ, ఇంజినీరింగ్ చదివిన వారు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ముఖాముఖి పరీక్షలో వీరి విద్యార్హతలు చూసి ఎంపిక కమిటీ సభ్యులే ఆశ్చర్యపోతున్నారు. జిల్లాలో 344 మద్యం దుకాణాలు ఉన్నాయి. దుకాణాల్లో మద్యం విక్రయించేందుకు ఇంటర్ విద్యార్హత...సూపర్‌వైజర్ పోస్టులకు బీకాం విద్యార్హతగా ప్రభుత్వం నిర్దేశించింది. కానీ ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో దాదాపు 20 శాతం మంది ఉన్నత విద్యార్హతలు కలిగి ఉన్నవారే కావడం విశేషం. ఓ దుకాణంలో పనిచేసేందుకు ఏకంగా పీహెచ్​డీ చేసిన అభ్యర్థి దరఖాస్తు చేయగా...విద్యార్హతలు ఎక్కువగా ఉన్నాయని ఎంపిక కమిటీ అతణ్ని తిరస్కరించింది. మద్యం విక్రయించే పోస్టులకు స్థానికులకే ప్రాధాన్యమివ్వగా...సూపర్‌వైజర్లగా మండలంలో ఉన్నవారికి అవకాశం కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details