కార్మిక సంఘాలు చేపట్టనున్న రేపటి దేశవ్యాప్త సమ్మెకు టీఎన్టీయూసీ మద్దతు ప్రకటించింది. తమ సంఘం ప్రతినిధులంతా సమ్మెలో పాల్గొననున్నట్లు టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు తెలిపారు. మోటరు వాహనాలకు అపరాధ రుసుములు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కాలంలో ఆటో, ఇతర మోటరు వాహనాలపై నమోదు చేసిన కేసులన్నింటినీ రద్దు చేయాలని కోరారు.
కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెకు టీఎన్టీయూసీ మద్దతు - కార్మికులకు టీఎన్టీయూసీ మద్దతు
కార్మిక సంఘాలు చేపట్టనున్న రేపటి దేశవ్యాప్త సమ్మెకు టీఎన్టీయూసీ మద్దతు ప్రకటించింది. జీవో 21ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. లాక్డౌన్ కాలంలో వాహనాలపై పెట్టిన కేసులను రద్దు చేయాలని కోరింది.
టీఎన్టీయూసీ మద్దతు