ఎయిడెడ్ ప్రక్షాళన అంటే విద్యార్థుల జీవితాలను నాశనం చేయడమేనా అని.. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ (TNSF state president Pranav Gopal) ప్రశ్నించారు. బ్రిటిష్ పాలకులు కూడా ఎయిడెడ్ వ్యవస్థకు ఊతమిచ్చారే తప్ప ఊడగొట్టాలనుకోలేదన్నారు. బడిలో ఉండాల్సిన విద్యార్థులను సీఎం జగన్ రెడ్డి(CM Jagan) బజారుకీడ్చాకని మండిపడ్డారు. పనికిరాని సలహాలిచ్చే సలహాదారు వ్యవస్థకు వందల కోట్లు వేతనాలుగా చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులేయడానికి రూ.3500 కోట్లు దుబారా చేశారని ధ్వజమెత్తారు. అమలు కాని సన్నబియ్య సంచుల కోసం రూ.750 కోట్లు దోచిపెట్టారన్నారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును బంగారు బాటలో నడిపే ఎయిడెడ్ స్కూళ్లకు.. గ్రాంట్ల కింద రూ.600 కోట్లు ఇవ్వలేకపోవడం సిగ్గుచేటన్నారు. ఎయిడెడ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని.. ముఖ్యమంత్రికి విద్యార్థుల దగ్గరకెళ్లి చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
ఎయిడెడ్ ప్రక్షాళన అంటే.. విద్యార్థుల జీవితాలను నాశనం చేయడమేనా..? : ప్రణవ్ గోపాల్ - టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ వార్తలు
బడిలో ఉండాల్సిన విద్యార్థులను సీఎం జగన్ రెడ్డి బజారుకీడ్చారని.. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు. ఎయిడెడ్ ప్రక్షాళన అంటే.. విద్యార్థుల జీవితాలను నాశనం చేయడమేనా అని ప్రశ్నించారు.
![ఎయిడెడ్ ప్రక్షాళన అంటే.. విద్యార్థుల జీవితాలను నాశనం చేయడమేనా..? : ప్రణవ్ గోపాల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13511587-77-13511587-1635679264294.jpg)
ఎయిడెడ్ ప్రక్షాళన అంటే విద్యార్థుల జీవితాలను నాశనం చేయడమేనా..?: ప్రణవ్ గోపాల్