దిల్లీ కదలిన టీఎన్ఎస్ఎఫ్ దళం - vijayawada
ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాటానికి బయల్దేరిన విద్యార్థి సంఘ నాయకులు.
విభజన హామీల సాధనకు ఈనెల 11న దిల్లీలో ముఖ్యమంత్రి ధర్మపోరాట దీక్ష చేయనున్నారు. మద్దతు తెలిపేందుకు టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున దిల్లీ బయలుదేరారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి నేతృత్వంలో ప్రత్యేక రైలులో బయలుదేరారు. విభజన హామీలు అమలు చేయాలనే విద్యార్థి సంఘాల నినాదాలతో రైల్వే స్టేషన్ హోరెత్తింది.