విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం ఇకనైనా పంతంవీడి.. పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య(tnsf) అధ్యక్షుడు వినోద్ డిమాండ్ చేశారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవాడ కేశినేని భవన్ వద్ద సమాఖ్య నాయకులు నిరసన చేపట్టారు. విద్యార్థుల తరఫున పరీక్షలు రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాస్తే.. ముఖ్యమంత్రి జగన్ మూర్ఖంగా, ఆలోచన రహితంగా ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి పరీక్షలు నిర్వహిస్తామని మాట్లాడటం.. కరోనా సమయంలో పరీక్షల నిర్వహణ అంటే విద్యార్థులప్రాణాలతో చెలగామాడినట్టే అన్నారు. ముఖ్యమంత్రి తన పతం వీడాలని కోరారు.
ఇకనైనా పంతం వీడి.. పరీక్షలు రద్దు చేయాలి: టీఎన్ఎస్ఎఫ్ - tnsf protest at vijayawada
పదోతరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్ఎస్ఎఫ్) అధ్యక్షుడు వినోద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ కేశినేని భవన్ వద్ద నిరసన చేపట్టారు.
తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య నిరసన