కార్పొరేట్ విద్యాసంస్థలకే ప్రభుత్వం కొమ్ముకాస్తోందని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్ మండిపడ్డారు. విద్యా సంవత్సరం ప్రారంభించకుండానే ఆన్‌లైన్ క్లాసుల పేరిట కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి పరిపాలన కేవలం ప్రకటనలకే పరిమితమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులందరికీ ప్రభుత్వం ట్యాబ్‌లు ఉచితంగా అందజేయడమే కాకుండా మారుమూల ప్రాంతాలకు సైతం ఉచిత వైఫై, ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించిన తర్వాతే ఆన్‌లైన్ విధానంపై ముందుకెళ్లాలని డిమాండ్ చేశారు.