కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కారణంగా... విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వీ ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు. ఇంటర్ పరీక్షలు సైతం వాయిదా వేయాలన్నారు.
కరోనా మరింతగా ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర విద్యా శాఖ విఫలమైందని ఆయన విమర్శించారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా త్వరగా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.