రాష్ట్రంలో విశాఖ, తూర్పుగోదావరి, చిత్తూరు, విజయనగరం, కర్నూలు, కడప జిల్లాల్లో పిడుగులు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరికలు జారీచేసింది. విశాఖ జిల్లాలో పాడేరు, జి.మాడుగుల, మాడుగుల, హుకుంపేట, అనంతగిరి, చింతపల్లి, చీడికాడ, దేవరాపల్లి, రావికమతంలో పిడుగులు పడవచ్చని సూచించింది. తూర్పుగోదావరి జిల్లాలో చింతూరు, వరరామచంద్రాపురం, మారేడుమిల్లి మండలాల్లో.. చిత్తూరు జిల్లాలో చిత్తూరు, బంగారుపాళ్యం, కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామసముద్రం, పుంగనూరు, నగరి, నిండ్ర, పాకాల మండలాల్లో.. విజయనగరం జిల్లాలో గుమ్మలక్ష్మీపుర, మక్కువ, కొమరాడ, పార్వతీపురం, సాలూరు, సీతానగరం పరిసరాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు, సిరివెళ్ల, వెల్దుర్తి, పాణ్యం, బనగానపల్లె, కోవెలకుంట్ల, సిరివెళ్ల, ఆళ్లగడ్డ, కల్లూరులో.. కడప జిల్లాలోని కాశినాయన, పోరుమామిళ్ల, బ్రహ్మంగారిమఠంలో కూడా పిడుగులు పడతాయని.. వాటికి తోడు ఈదురుగాలులతో వర్షం పడుతుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ అధికారులు సూచించారు.
ఆరు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక - chittoor
రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
పిడుగు