ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: అన్నదమ్ముళ్లను వేటకొడవళ్లతో నరికి చంపిన దుండగులు - brothers murder latest news

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా అనుముల మండలంలో అన్నదమ్ములు దారుణ హత్యకు గురయ్యారు. మరో వ్యక్తి ఈ దాడి నుంచి తప్పించుకున్నారు.

thugs-killed-brothers-in-nalgonda
thugs-killed-brothers-in-nalgonda

By

Published : Aug 3, 2020, 9:58 AM IST

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా అనుముల మండలం హజారీగూడెంలో దారుణం చోటుచేసుకుంది. అన్నదమ్ముళ్లను దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. మరో వ్యక్తి ఈ దాడి నుంచి తప్పించుకున్నాడు. హజారీగూడానికి చెందిన అన్నదమ్ములు సత్యనారాయణ, అంజి.. ఓ హత్య కేసులో నిందితులు. ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు.

రాత్రి ఆరుబయట నిద్రిస్తుండగా దుండగులు వేటకొడవళ్లతో దాడి చేసి... హత్యచేశారు. అన్నదమ్ములది ప్రతీకార హత్యగా పోలీసులు భావిస్తున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details