విజయవాడ రైల్వే స్టేషన్‌లో మూడేళ్ల వయస్సు పాపను గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. కూలీపనులు చేసుకుంటూ రాత్రి సమయాల్లో రైల్వే స్టేషన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న మీర్జావలి, హుస్సేన్ దంపతుల చిన్న కుమార్తె అపహరణకు గురైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఆర్పీఎఫ్ కార్యాలయంలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. గుర్తు తెలియని మహిళ పాపను తీసుకెళ్తున్నట్లు దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసి మూడు ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
విజయవాడ రైల్వేస్టేషన్లో మూడేళ్ల పాప అపహరణ
Girl Kidnap: విజయవాడ రైల్వే స్టేషన్‌లో మూడేళ్ల పాపను గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు మూడు ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చేపట్టారు.
విజయవాడ రైల్వేస్టేషన్లో మూడేళ్ల పాప అపహరణ