Jangaon Road accident news: తెలంగాణలోని జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లింగాల ఘనపురం మండలం వనపర్తి వద్ద సూర్యాపేట-జనగామ జాతీయ రహదారిపై కారు-టాటాఏస్ వాహనం ఢీకొని ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. టాటా ఏస్ వాహనం డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది.
అంత్యక్రియల కోసం వెళ్తూ...
కారు-టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని.... కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతులు హైదరాబాద్ శేరిలింగపల్లికి చెందిన చిన్నశేఖర్‌రెడ్డి, ధనలక్ష్మి, వారి కుమారుడు రఘురామరెడ్డిగా గుర్తించారు.