టెబుల్ టెన్నిస్ జాతీయ సమాఖ్య ఉపాధ్యక్షుడు షేక్ సుల్తాన్ కరోనాతో మృతి చెందారు. గత రాత్రి ఆయన భార్య లుబీనా మృతి చెందగా..పది రోజుల క్రితం సుల్తాన్ తల్లి మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా 2 వారాల్లో ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు వదలటం అందరని కలిచివేస్తోంది. ప్రస్తుతం సుల్తాన్ కుమారుడు వైరస్‌తో పోరాడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
2 వారాల వ్యవధిలో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి - కరోనాతో టెబుల్ టెన్నిస్ జాతీయ సమాఖ్య ఉపాధ్యక్షుడు షేక్ సుల్తాన్ మృతి
కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. రోజుల వ్యవధిలోనే ముగ్గురిని బలితీసుకొని ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. టెబుల్ టెన్నిస్ జాతీయ సమాఖ్య ఉపాధ్యక్షుడు షేక్ సుల్తాన్ కరోనాతో మృతి చెందగా..గత రాత్రి ఆయన భార్య, పది రోజుల క్రితం అతని తల్లి ప్రాణాలు విడిచారు.
ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి