ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెరుగుతున్న చలి తీవ్రత.. అనాథలకు ఆసరా కరువు.. - vijayawada newsupdates

రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది.. ఫలితంగా పట్టణాలు, నగరాల్లో అనాథలు సరైన వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాల్లో నిరాశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఎక్కడా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. విజయవాడ నగరంలో వారు రైల్వే స్టేషన్‌లు, బస్టాండు, రోడ్లు, పార్కుల వద్ద రోజులు వెళ్లదీస్తున్నారు.

Threat to life with increasing cold intensity at vijayawada
పెరుగుతున్న చలి తీవ్రత.. అనాథలకు ఆసరా కరువు..

By

Published : Dec 14, 2020, 11:41 AM IST

Updated : Dec 14, 2020, 12:42 PM IST

రోజురోజుకు చలిపెరుగుతోంది. ఫలితంగా నగరాలు, పట్టణాల్లో అనాథలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాల్లో నిరాశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం ఎక్కడా ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు. దీంతో వారు రైల్వే స్టేషన్‌లు, బస్టాండు, రోడ్లు, పార్కుల వద్ద రోజులు వెళ్లదీస్తున్నారు. సుప్రీంకోర్టు 2014లో ఈ తరహా సమస్యలపై స్పందించింది. అనాథలకు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పించాలని ఆదేశించింది. రోడ్లపై శయనించే నిరాశ్రయులకు షెల్టరు ఏర్పాటు చేసి మౌలికి వసతులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇప్పటికీ సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నాయనడానికి విజయవాడలోని ఈ దృశ్యాలే నిదర్శనం.

చలికి కవర్​లో ముడుచుకొని పడుకున్న యాచకుడు...

కునుకు పట్టదు...వణుకు వీడదు
చలి తీవ్రతకు ముడుచుకుని పడుకున్న అనాథలు
Last Updated : Dec 14, 2020, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details