ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇది తుగ్లక్‌ పాలన కాదు... జగ్లక్‌ పాలన' - ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ కామెంట్స్

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కాదు...జగ్లక్ పాలన కొనసాగుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

By

Published : Jan 25, 2020, 8:06 PM IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చాలని ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు శాంతియుతంగా చేస్తున్న ఆందోళన శిబిరంపై వైకాపా కార్యకర్తలు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. రాజధానిని తరలించొద్దని అమరావతి ప్రాంత ప్రజల చేస్తున్న ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడియాపైనా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆక్షేపించారు. శాసన మండలిని రద్దు చేస్తామని బెదిరిస్తూ పదకొండు మంది ఎమ్మెల్సీలను కొనుగోలు చేసేందుకు ప్రలోభాలకు తెరలేపారని ఆరోపించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కాదు...జగ్లక్ పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details