ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా ఆవిర్భావ దినోత్సవంలో.. బైకుల అపహరణ - విజయవాడ లేటెస్ట్​ అప్​డేట్స్​

thieves stolen bikes: తెదేపా ఆవిర్భావ దినోత్సవంలో దొంగలు వాళ్ల పని వాళ్లు కానిచ్చారు. విజయవాడలోని పార్టీ కార్యాలయం వద్ద పార్క్ చేసిన పలు బైకులు మాయం చేశారు. నాలుగు ద్విచక్రవాహనాలు చోరీకి గురైనట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.

thieves stolen bikes
బైకులను అపరించిన దొంగలు

By

Published : Mar 30, 2022, 3:21 PM IST

thieves stolen bikes: తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో దొంగలు చేతి వాటం ప్రదర్శించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీలో కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం పార్టీ కార్యాలయం వద్ద పార్క్ చేసిన పలు బైకులను దొంగలు మాయం చేశారు. వెంటనే స్పందించిన కార్యాలయ సిబ్బంది నాలుగు ద్విచక్రవాహనాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details